జ్ఞాన సముపార్జనకు ప్రతిభా కారంజీలు శ్రేష్టం
రాయచూరు రూరల్: విద్యార్థుల జ్ఞాన సముపార్జనకు ప్రతిభా కారంజీలు శ్రేష్టమని సీనియర్ కవయిత్రి శీలాదాస్ అభిప్రాయపడ్డారు. మంగళవారం ప్రైవేట్ పాఠశాల్లో దక్షిణ డివిజన్ ప్రతిభా కారంజీ 2025–26 ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థిలను ఉద్దేశించి మాట్లాడారు. నేటి పోటీ యుగంలో చదువుకు ఇస్తున్న ప్రాధాన్యతను అర్థం చేసుకోవాలన్నారు. జ్ఞానం పొంది విద్యను అభ్యసించాలని సూచించారు. పిల్లల సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యత ఉందని తెలిపారు. పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభలను వెలికి తీయడానికి ఇలాంటి వేదికలు అవసరమని వెల్లడించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో రావుత్ రావ్, సుగుణ, బసవరాజ్, హీరాలాల్, విజయ లక్ష్మి, యశోద, శ్రీదేవి, బిందు, వైశాలి, మారెప్ప, అనసూయ, దేవేంద్రప్ప, చెన్నమ్మ పాల్గొన్నారు.


