ఆరుగురు కుట్రదారులు
బనశంకరి: రాష్ట్రవ్యాప్తంగా తీవ్రసంచలనం రేకెత్తించిన ధర్మస్థలలో మృతదేహాలను పూడ్చిపెట్టారనే కేసులో విచారణ జరిపిన సిట్ అధికారులు బెళ్తంగడి జేఎంఎప్‌సీ కోర్టుకు ప్రాథమిక నివేదికను అందజేశారు. మృతదేహాలకు సాక్ష్యమంటూ మాస్కుమ్యాన్ చిన్నయ్య తీసుకొచ్చిన పుర్రె కుట్రలో గిరీశ్ మట్టణ్ణవర్, కే.జయంత్, సుజాతా భట్ సహా మొత్తం 6 మంది ఉన్నారని వెలుగులోకి వచ్చింది.
పుర్రె తెచ్చాక పీడకలలు
ధర్మస్థలలో శవాలను పూడ్చివేశారంటూ సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేయగా గిరీశ్, కే.జయంత్, సుజాతాభట్ ఢిల్లీకి వెళ్లారు. అక్కడ హోటల్‌లో బస చేశారు. జయంత్ వెంట పుర్రె ఉంది, రాత్రి మంచం కింద పెట్టి నిద్రపోయినప్పుడు జయంత్‌కు పీడ కలలు రావడంతో పుర్రె వద్దని గొడవ చేశాడని నివేదికలో పేర్కొన్నారు. గిరీశ్ అతనిని సముదాయించి ఓ పెట్టెలో పెట్టి సుజాతాభట్‌కు ఇచ్చారు. ఇందులో ఏముందని ఆమె అడగగా పాతపైపులు ఉన్నాయని చెప్పారు. రెండురోజుల తరువాత జయంత్ ధైర్యం చేసి పుర్రెను తీసుకుని మంగళూరు కు వెళ్లాడు. అక్కడ మహేశ్‌శెట్టి తిమరోడి ఇంటికి వెళ్లాడు. ఈ పుర్రె ను ధర్మస్థలలోని బంగ్లా గుడ్డ నుంచి సౌజన్య మామ విఠలగౌడ సేకరించాడు. వీరందరూ కలిసి పథకం ప్రకారం ధర్మస్థల మీద దుష్ప్రచారం చేశారని సిట్ పేర్కొంది. అక్కడ ఎలాంటి అత్యాచారాలు, హత్యలు జరిగిన దాఖలాలు లేవని పేర్కొంది.
ధర్మస్థలపై దుష్ప్రచారం
వెనుక చిన్నయ్య, ముఠా
బెళ్తంగడి కోర్టులో సిట్ నివేదిక


