పర్యాటకుల కోలాహలం
ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, దక్షిణ కాశీగా పేరొందిన హంపీకి ఆదివారం పర్యాటకులు పోటెత్తారు. వరసగా సెలవులు రావడంతో హంపీ వీధులు కిటకిటలాడుతున్నాయి. కొన్ని చోట్ల ట్రాఫిక్ జామ్
ఏర్పడింది. రాయల కాలం నాటి లోటస్ మహాల్, ఎలిఫెంట్ హౌస్, ఏకశిలా రథం, సరిగమలు స్వప్త స్వరాల మందిరం,
హాజరామ మందిరం, మహానవమి దిబ్బ, విజయ విఠల దేవస్థానం, ఉగ్రనరసింహ, రాణిస్థాన మందిరం, జైన్ మందిరం, కోదండ రామ మందిరాన్ని వీక్షించారు. విరుపాక్ష స్వామిని దర్శించుకున్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఎస్పీ జాన్హవి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు
మాల్యవంత పర్వతం వద్ద సూర్యోదయ అందాలు వీక్షించేందుకు ఉదయం పెద్ద ఎత్తున దేశ, విదేశాలకు చెందిన పర్యాటకులు తరలివచ్చారు.– హొసపేటె:
పర్యాటకుల కోలాహలం


