నేటి నుంచి అంతర్జాతీయ వ్యవసాయ సమ్మేళనం
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వ విద్యాలయంలో సోమవారం నుంచి మూడు రోజుల పాటు అంతర్జాతీయ వ్యవసాయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ చాన్సలర్ హన్మంతప్ప వెల్లడించారు. ఆదివారం ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. 29 నుండి 31వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. భారత వ్యవసాయ సాంస్కృతిక పరంపర, సాంప్రదాయక వ్యవసాయం ఇతర అంశాలపై చర్చాగోష్టి ఉంటుందని పేర్కొన్నారు. సమ్మేళనంలో న్యూఢిల్లీలోని జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ డైరక్టర్ శ్రీనివాస్ రావు, సురేష్, జగదీష్, వీరణ్ణ, పాటిల్, విష్ణువర్దన్, ఖమర్ పొల్గొంటారని తెలిపారు.
రాయచూరు రూరల్: యాదగిరిలో రాష్ట్ర స్థాయి విజ్ఞాన సమ్మేళనాన్ని సోమవారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్నట్లు విజ్ఞాన సమ్మేళనం సంచాలకుడు, రవి పాటిల్ పౌండేషన్ అధ్యక్షుడు రవి పాటిల్ వెల్లడించారు. ఆదివారం యాదగిరి క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. 29 నుంచి 30వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. విజ్ఞానం ఇతర అంశాలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. సమ్మేళనానికి శరణు సంత సూపీ సంచాలకుడు సత్యంపేట, నిజగుణానంద స్వామి, హులికల్ నటరాజ్ హాజరవుతారన్నారు. ఆరు సాహిత్య గ్రంథాలను ప్రజాపనుల శాఖ మంత్రి సతీష్ జార్కిహోళి విడుదల చేస్తారన్నారు.


