నగల షాపు.. దొంగలు.. కాల్పులు
దోపిడీ తరువాత ఖాళీగా కనిపిస్తున్న షోకేసులు
నగల షాపులో సిబ్బందిని విచారిస్తున్న పోలీసులు
మైసూరు: పర్యాటక రాజధానిగా పేరుపొందిన మైసూరులో విచ్చలవిడిగా సైబర్ నేరాలు, తరచూ చోరీలు, విస్ఫోటాలు జరుగుతున్నాయి. ఇంతలో పట్టపగలు ముసుగు దొంగల బృందం సినిమా స్టైల్‌లో నగల షాపును దోచుకున్నారు. ఈ ఘటన జిల్లాలోని హుణసూరు పట్టణంలో జరిగింది. కనీసం రూ.5 కోట్ల నగలను ఎత్తుకెళ్లారు.
ఎలా జరిగిందంటే..
● ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు హుణసూరు బస్టాండ్ వెనుక ఉన్న స్కై గోల్డ్ డైమండ్ షాపులో ఈ లూటీ జరిగింది.
● రెండు బైక్‌లలో ఐదుమంది దుండగులు ముఖానికి ముసుగులు ధరించి చొరబడ్డారు. రాగానే పిస్టళ్లు తీసి సిబ్బందిని బెదిరించారు. అక్కడ ఉన్న కస్టమర్లు, సిబ్బంది, మేనేజర్‌పై తుపాకులను గురిపెట్టి, గాల్లోకి కాల్పులు జరిపి భయభ్రాంతులకు గురిచేశారు. తర్వాత అందరినీ అదుపులోకి తీసుకున్నారు.
● షోకేసుల నుంచి వజ్రాలు, బంగారు ఆభరణాలను తీసి సంచుల్లోకి భర్తీ చేయాలని చెప్పారు. సిబ్బంది సంకోచించగా, పిస్టల్‌తో గాల్లోకి కాల్పుల జరిపారు.
● ప్రతిఘటించిన స్టోర్ మేనేజర్ అజ్గర్ పై కాల్పులు జరపడంతో గాయపడ్డాడు.
● రూ. 5 కోట్ల విలువచేసే బంగారం, వజ్రాల ఆభరణాలను సంచుల్లో నింపుకొని దొంగలు బైక్‌ల పై పారిపోయారు. ఓ దొంగ హెల్మెట్‌ను అక్కడే వదిలేశాడు.
● కొందరు ప్రజలు దొంగలను వెంబడించడానికి ప్రయత్నించారు, కానీ వారిని పట్టుకోలేకపోయారు. కాల్పుల్లో గాయపడిన మేనేజర్ ను ఆసుపత్రిలో చేర్చారు.
రూ.5 కోట్ల బంగారం,
వజ్రాభరణాల లూటీ
మైసూరు జిల్లా హుణసూరులో
పట్టపగలు కల్లోలం
పోలీసుల విచారణ
స్థానిక రూరల్, టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫోరెన్సిక్ నిపుణులు వేలిముద్రల కోసం గాలించారు. జిల్లా ఎస్పీ ఎన్. విష్ణువర్ధన్, ఎఎస్పీ ఎల్.నాగేష్ అంగడిని తనిఖీ చేశారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ద్వారా దొంగలను గుర్తించే పనిలో ఉన్నారు. పట్టపగలు జరిగిన ఈ దోపిడీ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.
నగల షాపు.. దొంగలు.. కాల్పులు
నగల షాపు.. దొంగలు.. కాల్పులు


