పోస్టాఫీసులో రూ.2 కోట్ల స్వాహా
గౌరిబిదనూరు: తాలూకా ఆలగానహళ్ళిలో ఇడగూరుకు చెందిన రమ్య అనే మహిళ పోస్టాఫీసులో ఉద్యోగం చేస్తూ ప్రజల డబ్బులను భారీ మొత్తంలో స్వాహా చేసింది. ఇప్పుడు తమ డబ్బులు లేకపోవడంతో ప్రజలు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన మేరకు.. రమ్య 2013 ఆలగానహళ్లి పోస్టాఫీసులో ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఇందులో సుమారు 1200 మంది ఖాతాదారులు వివిధ పథకాల కింద డబ్బులు జమచేస్తున్నారు. అయితే వారు జమ చేసిన డబ్బు ఖాతాలలోకి జమ కాలేదని, దివ్యాంగులు, వితంతు, వృద్దుల పెన్షన్ సైతం చాలామందికి అందలేదని గ్రామప్రజలు ఆరోపించారు. సుమారు రూ.2 కోట్లకు పైబడిన సొమ్ము రమ్య పాలైనట్లు వాపోయారు.
పోస్టల్ అధికారుల నిర్బంధం
శుక్రవారం సాయంకాలం విచారణకు వచ్చిన పోస్టల్ అధికారులను లోపల ఉంచి గ్రామస్థులు తాళం వేశారు. కొంత సేపటికి రూరల్ పోలీసులు వచ్చి వారిని విలిపించి, బాధితులు స్టేషనులో ఫిర్యాదు చేయాల్సిందిగా సూచించారు. శనివారం గ్రామప్రజలు మళ్లీ ఆందోళనకు దిగారు. పై అధికారులు వచ్చి లెక్కలు తేల్చాల్సి వుంది. రమ్య రూరల్ పోలీసు స్టేషనుకు వచ్చింది. ఖాతాదారుల డబ్బు ఎక్కడికీ పోదని, పోస్టాఫీసువారు చెల్లిస్తారని పోస్టల్ ఇన్స్‌పెక్టర్ హనుమంతప్ప చెప్పారు.
మహిళా ఉద్యోగిని బాగోతం
ఖాతాదారుల ఆందోళన
పోస్టాఫీసులో రూ.2 కోట్ల స్వాహా


