కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీ
మండ్య: మండ్య జిల్లాలోని మద్దూరు తాలూకాలోని గెజ్జలగెరె మన్‌మూల్ కేంద్రం సమీపంలో బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే సర్వీస్ రోడ్డుపై శుక్రవారం రాత్రి కారు, గూడ్స్ లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్, మండ్య నగరంలోని హాలెటౌన్‌వాసి గోవిందరాజు (33), యట్టగడహళ్లికి చెందిన అశోక్ (35) మరణించారు. మరొకరు దినేష్ జోసెఫ్ (33) తీవ్రంగా గాయపడ్డారు. అతనిని మైసూరులోని నారాయణ హృదయాలయలో చేర్చారు, పరిస్థితి విషమంగా ఉంది. వీరందరూ చన్నపట్టణ తాలూకాలోని ముదిగెరె సమీపంలోని ఎంపైర్ హోటల్‌లో క్రిస్మస్ విందును ముగించుకుని కారులో తిరిగి వస్తున్నారు. ఘటనాస్థలిలో సర్వీస్ రోడ్డులో రోడ్డు పక్కన ఆగి ఉన్న కంటైనర్ లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. మలవళ్లి డీఎస్పీ యశ్వంత్ కుమార్, సీఐ నవీన్, ట్రాఫిక్ ఎస్‌ఐ రామస్వామి సంఘటనా స్థలాన్ని పరిశీలించి కారును పక్కకు తొలగించారు.
అశోక్ గోవిందరాజు (ఫైల్)
ఇద్దరు మృతి, మరొకరికి విషమం
మండ్య జిల్లాలో ప్రమాదం
కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీ
కంటైనర్‌ను వెనుక నుంచి కారు ఢీ


