టీబీ డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్ల పనులు షురూ
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని పలు జిల్లాల రైతులకు, ప్రజలకు సాగు, తాగు నీరందించే ప్రధాన జలాశయం తుంగభద్ర డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్లను ఏర్పాటు పనులకు మండలి అధికారులు నడుం బిగించారు. చాలా రోజులుగా వాయిదా పడిన తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్లను ఏర్పాటు చేసే పనులను ఎట్టకేలకు తుంగభద్ర బోర్డు అధికారులు ప్రారంభించారు. కొత్తగేట్లకు పూజ చేయడం ద్వారా అధికారికంగా పనులకు శ్రీకారం చుట్టారు. డ్యాం మొదటి గేటు, 18వ గేట్ ఏర్పాటుకు పనులు ప్రారంభం అయ్యాయి. భారీ క్రేన్‌ను ఉపయోగించి గేట్లను లోతునకు దించే పనిని నిర్వహిస్తున్నారు. ఒక గేట్ ఏర్పాటుకు సుమారు 8 నుంచి 10 రోజుల సమయం పడుతుందని మండలి ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. తుంగభద్ర డివిజన్ కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి, ఈఈ చంద్రశేఖర్, ఎస్‌ఈ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీబీ డ్యాంకు కొత్త క్రస్ట్‌గేట్ల పనులు షురూ


