అసంఘటిత కార్మికులకు ఈఎస్‌ఐ సేవలు
రాయచూరు రూరల్: కార్మికులకు తోడు అసంఘటిత కార్మికులకు ఈఎస్‌ఐ సేవలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర కార్మిక, ఉద్యోగ శాఖ మంత్రి శోభ కరంద్లాజె వెల్లడించారు. కలబుర్గి ఈఎస్‌ఐ ఆడిటోరియంలో జరిగిన కార్య క్రమంలో ఆమె మాట్లాడుతూ కలబుర్గిలో 560 పడకల ఈఎస్‌ఐ ఆస్పత్రి ఉందని, ఐపీసీజీ, జీహెచ్‌ఎస్ పథకాలు విస్తరించామన్నారు. దేశంలో పది ఈఎస్‌సీ కళాశాలలు ఉన్నాయని, 27 చట్టాలను రద్దుచేసి నాలుగు కార్మిక చట్టాలను రూపొందించామని వివరించారు. సభలో డీన్ క్షీరసాగర్, కలబుర్గి గ్రామీణ శాసనసభ్యుడు బసవరాజ్, విధాన పరిషత్ సభ్యుడు బిజి.పాటిల్, అమర్‌నాథ్ పాటిల్, దత్తాత్రేయ పాటిల్, అధికారులు కడ్డిమట్, పద్మ పద్మజ, యువరాజ్, సుబ్రహ్మణ్యం, శివరాజ్‌పాటిల్, మహదేవ్ పాల్గొన్నారు.


