క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు
సాక్షి బళ్లారి: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు పూజించి, ఆరాధించే ఏసుక్రీస్తు పుట్టిన రోజును పురస్కరించుకొని పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ వేడుకకు నగరంలోని చర్చిలన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నాయి. నేడు గురువారం క్రిస్మస్ పర్వదిన వేడుక నేపథ్యంలో నగరంలోని సీఎస్‌ఐ, క్యాథలిక్ చర్చిలన్నింటినీ ముస్తాబు చేశారు. సీఎస్‌ఐ తెలుగు చర్చి, సీఎస్‌ఐ కన్నడ చర్చి, సీఎస్‌ఐ ఇంగ్లిష్ చర్చిలతో పాటు సెయింట్ ఆంథోని చర్చి, క్రైస్తవుల కింగ్, అలాగే స్వతంత్రంగా సుమారు 100 దాకా ఉన్న వివిధ చర్చిలన్ని క్రిస్మస్ వేడుకకు ప్రత్యేక విద్యుత్ దీపాలంకరణలతో పాటు వివిధ రకాలుగా ముస్తాబు చేసి నగర వాసులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దారు. ముఖ్యంగా బళ్లారికే తలమానికంగా ఉన్న విద్యానగర్‌లోని ఆరోగ్యమాత చర్చిని మరింత శోభాయమానంగా తీర్చిదిద్దారు. ఈ చర్చికి ఎంతో చారిత్రాత్మక నేపథ్యం, చరిత్ర కూడా ఉంది.
సర్వాంగ సుందరంగా చర్చి పరిసరాలు
క్రిస్మస్ పర్వదినం రోజునే కాకుండా ప్రతి రోజు కూడా ఈ చర్చికి పెద్ద సంఖ్యలో వచ్చి ప్రార్థనలు చేస్తారు. సువిశాలంగా, సర్వాంగ సుందరంగా నిర్మించిన ఆరోగ్యమాత చర్చిలో కాలు పెట్టిన వెంటనే అదో రకమైన పుణ్యక్షేత్రంగా ప్రతి ఒక్కరినీ కట్టిపడేసి ఆకట్టుకుంటుంది. ఏసుక్రీస్తు జననం నుంచి ఆయన పెరిగిన విధానం, శిలువ వేసిన దృశ్యాలు ఒక్కొక్క దానికి ఒక్కో ఆలయం తరహాలో అద్దాల మేడలో అద్భుతంగా విగ్రహాలు ఏర్పాటు చేసి వాటి కింద ఏసుక్రీస్తు ప్రస్థానానికి సంబంధించిన ఆధార లిఖితాలను పొందుపరచడంతో క్రిస్మస్ పర్వదినం నాడు ఆరోగ్యమాత చర్చి క్రైస్తవులకే కాక అన్ని కుల మతాల వారికి పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. దీంతో ఈ చర్చికి క్రిస్మస్ రోజున పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేస్తుండటంతో ఫాదర్లు భక్తులతో ప్రార్థనలు చేయించేందుకు అక్కడే ఉంటూ భక్తిపారవశ్యంతో చర్చిలో క్రిస్మస్ వేడుకలను జరపనున్నారు.
బళ్లారి నగరానికే తలమానికం ఆరోగ్య మాత చర్చి
నగరంలోని తెలుగు, కన్నడ, ఇంగ్లిష్ చర్చిలన్ని అలంకరణలతో కళకళ
క్రిస్మస్‌కు మేరీమాత చర్చి సిద్ధం
బళ్లారి రూరల్: క్రైస్తవుల పవిత్ర పండుగ క్రిస్మస్‌కు రాయచూరు, కొప్పళ, బళ్లారి జిల్లాలకు పెద్ద చర్చిగా పేరుగాంచిన బళ్లారి మేరీమాత చర్చిలో బుధవారం అలంకరణలు దాదాపు పూర్తయ్యాయి. బళ్లారి పరిసర జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు క్రిస్మస్‌కు చర్చికి వచ్చి కరుణామయుడిని దర్శించుకొని ప్రార్థనలు నిర్వహించడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున చర్చి పెద్దలు ఏర్పాట్లు చేశారు. చర్చి ప్రాంగణంలోని యేసయ్య జీవిత చరిత్రకు సంబంధించిన చిత్రాలతో కటౌట్లను ఏర్పాటు చేశారు. చర్చి ముందు బొమ్మలతో కూడిన బాల క్రీస్తును ఏర్పాటు చేశారు. అదేవిధంగా నగరంలోని కోట ప్రాంతంలో తెలుగు చర్చిల్లో క్రిస్మస్ పర్వదిన ఆచరణకు అన్ని ఏర్పాట్లు చేశారు.
క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు
క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు
క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు
క్రిస్మస్‌కు చర్చిలు ముస్తాబు


