కుట్టు మిషన్ల పంపిణీ | - | Sakshi
Sakshi News home page

కుట్టు మిషన్ల పంపిణీ

Nov 26 2025 6:35 AM | Updated on Nov 26 2025 6:35 AM

కుట్ట

కుట్టు మిషన్ల పంపిణీ

హొసపేటె: మహిళా నరేగ కార్మికులకు సఖి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో తాలూకాలోని పాపినాయకనహళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో మంగళవారం కుట్టు శిక్షణ, కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీపీ ఈఓ ఆలం బాషా మాట్లాడుతూ నైపుణ్యాభివృద్ధి ద్వారా బాలికలను శక్తివంతం చేయడంలో, సమాజాన్ని సాధికారత వైపు తీసుకెళ్లడంలో మహిళల పాత్ర చాలా ముఖ్యమైందని తెలిపారు. కుట్టు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈసందర్భంగా సఖి ట్రస్ట్‌ డైరెక్టర్‌ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

చోరీ కేసుల్లో నిందితుల అరెస్టు

హొసపేటె: తాలూకాలోని అరసీకెరె పోలీసు స్టేషన్‌ పరిధిలోని ఉచ్చంగిదుర్గ గ్రామంలోని సంత మైదానం సమీపంలో ఇద్దరు మహిళల దృష్టిని మళ్లించి బంగారు ఆభరణాలను, మరో కేసులో గొర్రెలను దొంగిలించిన కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా సంతెబెన్నూరుకు చెందిన సిద్రామ, ప్రకాష్‌, జయమ్మ అనే ముగ్గురు నిందితులను పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసుల్లో నిందితుల నుంచి రూ.2.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరొక గొర్రెల దొంగతనం కేసులో నిందితుడు హనుమంత కూడ్లిగి తాలూకాలోని పాలయ్యన కోటె గ్రామంలో నివసిస్తున్నాడు. అతని నుంచి రూ.1.30 లక్షల నగదు, ఒక బైక్‌ స్వాధీనం చేసుకున్నారు. 3 కేసుల్లో మొత్తం రూ.3.60 లక్షలు విలువైన బంగారు ఆభరణాలు, నగదు, ఒక బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు.

హ్యామర్‌ త్రో పోటీల్లో

రాష్ట్ర స్థాయికి ఎంిపిక

రాయచూరు రూరల్‌: జిల్లాలో విద్యా శాఖ ఆధ్వర్యంలో జరిగిన అండర్‌–17 బాలికల జిల్లా స్థాయి హ్యామర్‌ త్రో పోటీలలో రాయచూరు తాలూకా యరగేర విద్యార్థిని రాష్ట్ర స్థాయికి ఎంిపికై ంది. మొరార్జి దేశాయి ప్రభుత్వ హైస్కూలు విద్యార్థిని కవిత రెండవ స్థానం పొంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అర్హత సాధించింది. ఈనేపథ్యంలో ప్రిన్సిపాల్‌ కొట్రేశ్‌, ఉపాధ్యాయులు అభినందించారు.

సదుపాయాలు కల్పించరూ

బళ్లారిటౌన్‌: తాలూకాలోని కొళగల్లు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో గ్రామ పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని జిల్లా డీవైఎఫ్‌ఐ నాయకులు మంగళవారం జిల్లాధికారి నాగేంద్ర ప్రసాద్‌కు వినతి పత్రాన్ని సమర్పించారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు యూ.ఎర్రిస్వామి మాట్లాడుతూ కొళగల్లు గ్రామంలో దాదాపు 20 వేల జనాభా ఉన్నా చాలా కాలంగా సరైన మంచినీటి సౌకర్యంతో పాటు ఇతర సదుపాయాలు లేక వంచితులవుతున్నారన్నారు. సర్వే నెంబర్‌– 557లో 296 ఎకరాల భూమిలో చెరువు నిర్మిస్తే ఆ గ్రామంతో పాటు ఇతర గ్రామాలకు నీరు అందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో సరైన తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కూడా లేదన్నారు. గ్రామంలో ఎన్నో పేద కుటుంబాలకు ఇళ్లు లేక పూరి గుడిసెల్లో నివాసం ఉంటున్నారన్నారు. ఇక వార్డుల్లో సీసీ రోడ్లు, అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ సదుపాయాలు లేవన్నారు. ఇతర గ్రామాలకు వెళ్లేందుకు సరైన లింక్‌ రోడ్లు అభివృద్ధి కానందున సమస్యలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వీటిపై పంచాయతీ అధికారులు తగిన శ్రద్ధ చూపక పోవడంతో జిల్లాలోనే అతి పెద్ద గ్రామ పంచాయతీ కొళగల్లు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందన్నారు. పదాధికారులు బైల హనుమప్ప, సీపీ నవీన్‌, జీఎన్‌.ఎర్రిస్వామి, తిప్పేరుద్ర, మస్తాన్‌, ఆలంబాష పాల్గొన్నారు.

సూగూరేశ్వర జాతర ప్రారంభం

రాయచూరు రూరల్‌: జిల్లాలోని దేవదుర్గ తాలూకా అరకెరలో సూగూరేశ్వర జాతర, ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మంగళవారం గ్రామంలో వెలసిన బసవేశ్వర ఆలయం వద్ద పూజలు చేసి సూగూరేశ్వరాలయం వరకు మహిళలు కుంభ కలశాలతో ఊరేగించారు. వీరగాసె నృత్యం చేస్తూ ఒడుపులు చెబుతూ ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. పూజల్లో శాంతమల్ల శివాచార్యులు, సిద్దరామేశ్వర స్వామీజీ, పంచాక్షరి స్వామీజీలు పాల్గొన్నారు.

కుట్టు మిషన్ల పంపిణీ 1
1/3

కుట్టు మిషన్ల పంపిణీ

కుట్టు మిషన్ల పంపిణీ 2
2/3

కుట్టు మిషన్ల పంపిణీ

కుట్టు మిషన్ల పంపిణీ 3
3/3

కుట్టు మిషన్ల పంపిణీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement