ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరివ్వాలి
రాయచూరు రూరల్: తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు కింద రెండో పంటకు నీరందించాలని జేడీఎస్ రాష్ట్ర యువ అధ్యక్షుడు నిఖిల్ కుమారస్వామి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సింధనూరులో ఈరణ్ణ దేవాలయం వద్ద పాదయాత్రకు శ్రీకారం చుట్టి మాట్లాడారు. రబీ పంటలకు నీరందించి రైతులను ఆదుకోవాలన్నారు. తుంగభద్ర డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు డ్యాం 50 టీఎంసీల నీరున్నా గేట్ల ఏర్పాటుకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. రాయచూరు, కొప్పళ, బళ్లారి, విజయనగర జిల్లాల్లోని ఇంచార్జి మంత్రులు, శాసన సభ్యులు, విధాన పరిషత్ సభ్యులు కలిసి ముఖ్యమంత్రిపై తుంగభద్ర ఎడమ కాలువ కింద రెండో పంటకు నీరందించేలా ఒత్తిడి తేవాలన్నారు. కాలువకు నీరు వదలకుంటే ఎకరాకు రూ.50 వేలు చొప్పున పరిహారం అందించాలన్నారు. డ్యాం క్రస్ట్‌గేట్ల అమరిక కోసం రైతులు రబీ పంటలను వదులుకోవడం సాధ్యం కాదన్నారు. కళ్యాణ కర్ణాటకలోని రైతులకు పరిహారం అందివ్వాలన్నారు. రైతుల పంటలకు మద్దతు ధరలు ప్రకటించాలన్నారు. వరి, పత్తి, కంది, ఇతర పంటలు ఖరీఫ్‌లో భారీ వర్షాలకు పూర్తిగా నష్టం సంభవించినట్లు ఆరోపించారు. మద్దతు ధరతో వరి, కంది, పత్తి, మొక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో మాజీ మంత్రి వెంకట్రావ్ నాడగౌడ, మాజీ ఎమ్మెల్యే రాజా వెంకటప్ప నాయక్, జిల్లాధ్యక్షుడు విరుపాక్షి, శివశంకర్‌లున్నారు.
డ్యాం క్రస్ట్‌గేట్ల అమరికకు చర్యలు చేపట్టాలి
యువ జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు
నిఖిల్ కుమారస్వామి
పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి
పాదయాత్రకు శ్రీకారం


