ఇంజినీర్‌పై మంత్రి మండిపాటు
రాయచూరు రూరల్: ఓ అధికారిని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి బోసురాజు అసభ్య పదజాలంతో నిందించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం సాయంత్రం మాన్వి తాలూకా మరాఠ గ్రామంలో కళ్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.1.41 కోట్లతో ప్రాథమిక పాఠశాలకు నాలుగు నూతన భవనాల నిర్మాణానికి భూమిపూజ చేసిన అనంతరం ఇంజినీర్‌ను కట్టేసి తంతామంటున్న వీడియో వైరల్ అయింది. నిధులు మంజూరైనా అభివృద్ధి పనులు చేపట్టకుండా కాలయాపన చేశారనే ఆరోపణలపై మంత్రి బోసురాజు ఈ పదాలను వినియోగించారని శాసన సభ్యుడు హంపయ్యనాయక్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగిని మంత్రి అవమానించినా ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కృష్ణ మౌనం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
కార్మిక వ్యతిరేక చట్టాలు రద్దు చేయండి
రాయచూరు రూరల్: కేంద్రంలోని బీజేపీ సర్కార్ అమలు చేస్తున్న నాలుగు కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని ఏఐటీయూసీఐ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం రాయచూరు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు శరణ బసవ మాట్లాడారు. కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, నెలకు రూ.47 వేల చొప్పున వేతనాలు చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనాలు, కాంట్రాక్ట్ కార్మిక పద్ధతిని రద్దు చేయాలని, జాతీయ గ్రామీణ ఉద్యోగ ఖాత్రి పథకంలో రక్షణ కల్పించాలన్నారు. రైతులకు పంట నష్టపరిహారం అందించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో శరణేగౌడ, వీరేష్, ఇతర సంఘాల కార్యకర్తలున్నారు.
అంగన్‌వాడీ కార్యకర్తల ధర్నా
రాయచూరు రూరల్: అంగన్‌వాడీ కార్యకర్తలను పర్మినెంట్ చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం డిమాండ్ చేసింది. మంగళవారం తాలూకా సీడీపీఓ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో అధ్యక్షురాలు పద్మ మాట్లాడారు. 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్రశిశు సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న వారిని పర్మినెంట్ చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో వేతనాలు పెంచి ఆదుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
మహావీర్ విగ్రహాల ఊరేగింపు
రాయచూరు రూరల్: నగరంలో మహావీర్ విగ్రహాల ఊరేగింపు చేపట్టారు. మంగళవారం రాజేంద్ర సంఘం ఆధ్వర్యంలో జైన్ మందిరం వద్ద మహావీర్, పద్మావతిల విగ్రహాలను ఊరేగించారు. జైన్ మందిరం నుంచి మహావీర్ సర్కిల్, మహబళేశ్వర సర్కిల్ మీదుగా రాజేంద్ర గంజ్‌లో నూతనంగా మహావీర్, పద్మావతిల విగ్రహాల ప్రతిష్టాపన చేశారు. జైన్ మందిరం వద్ద మహావీర్, పద్మావతిల విగ్రహాలకు మహిళలు పూజలు జరిపారు.
రైతుల నుంచి పత్తి
కొనుగోలు చేయండి
రాయచూరు రూరల్: రాయచూరు, యాదగిరి జిల్లాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా పత్తిని కొనుగోలు చేయాలని భారతీయ పత్తి మండలి అధికారులకు లోక్‌సభ సభ్యుడు కుమార నాయక్ సూచించారు. సోమవారం రాయచూరు ఏపీఎంసీ ఆవరణలో అధికారులు, రైతులతో చర్చించి మద్దతు ధరతో రైతులు తెచ్చిన వాణిజ్య పంటలను కొనాలన్నారు. 2025–26లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర తో కొనుగోలు చేయాలన్నారు. ఆర్‌ఏపీఎంసీ అధ్యక్షుడు జయంతిరావ్, శశిధర్ పాటిల్, మల్లనగౌడ, శంకర్‌రెడ్డి, శరభణ్ణలున్నారు.
ఇంజినీర్‌పై మంత్రి మండిపాటు


