
కారు– ఆటో ఢీ, ముగ్గురికి గాయాలు
దొడ్డబళ్లాపురం: కారు, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన దొడ్డ తాలూకా తూబుగెరె గ్రామం వద్ద జరిగింది. తూబుగెరె శివారులోని చెరువు కట్ట మీద ఎదురెదురుగా వచ్చిన ఆటో, కారు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జు కాగా, అందులో ఉన్న మధు (20), అర్జున్ (13), యశ్వంత్ (13) తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు దొడ్డ ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి బెంగళూరు విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కారులో ఉన్న వారికి స్వల్ప గాయాలయ్యాయి. దొడ్డ గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.