
కులాంతర ప్రేమ గొడవ..
కలబుర్గి జిల్లాలో పరువు హత్య
సాక్షి, బళ్లారి: పరువు పేరిట కన్న తండ్రే హంతకుడయ్యాడు, వేరే కులానికి చెందిన యువకున్ని ప్రేమించిందని ఓ కిరాతకుడు కూతురిని హతమార్చిన ఘటన కలబుర్గి జిల్లాలో జరిగింది. మేళకుంద గ్రామానికి చెందిన కవిత కొల్లూరు (19) అగ్రవర్ణ యువతి, అదే గ్రామానికి చెందిన మాళప్ప పూజారి అనే బీసీ కులానికి చెందిన యువకున్ని ప్రేమించింది. అతడు ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. వద్దని తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించినా కవిత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది.
పురుగుల ముందు పోసి..
ఆక్రోశంతో రగిలిపోయిన తండ్రి శంకర్.. బుధవారంనాడు కూతురిపై దాడి చేసి గొంతు పిసికి ప్రాణాలు తీశాడు. నోట్లోకి పురుగుల మందును పోసి.. ఆత్మహత్య చేసుకుందని కట్టుకథ అల్లారు. తరువాత అంత్యక్రియల పేరుతో మృతదేహాన్ని కాలి్చవేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సమగ్ర తనిఖీ చేయగా కూతురిని తండ్రితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు తేలింది. శుక్రవారంనాడు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.