రోడ్లపై కిరణ్‌ మజుందార్ షా విమర్శలు.. డీకే స్ట్రాంగ్‌ కౌంటర్‌ | DK Shivakumar Responds to Kiran Mazumdar-Shaw’s Criticism on Bengaluru Roads and Garbage Issues | Sakshi
Sakshi News home page

రోడ్లపై కిరణ్‌ మజుందార్ షా విమర్శలు.. డీకే స్ట్రాంగ్‌ కౌంటర్‌

Oct 18 2025 1:37 PM | Updated on Oct 18 2025 2:48 PM

DK Shiva Kumar Counter To Kiran Mazumdar Shaw

బెంగళూరు: ఇటీవలి కాలంలో బెంగళూరు రోడ్ల (Bengaluru Roads) పరిస్థితిపై సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌, చర్చ నడుస్తోంది.  ఓ విదేశీ విజిటర్‌.. బెంగళూరు నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని ఆమె ఓ పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టుపై  బయోకాన్ (Biocon) లిమిటెడ్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్ షా(Kiran Mazumdar-Shaw) విమర్శలు చేయడం తీవ్ర చర్యనీయాంశమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌(DK Shivakumar) స్పందించారు.

తాజాగా డీకే శివకుమార్‌ రోడ్లపై పెడుతున్న పోస్టులపై కౌంటరిచ్చారు. ఘాటుగా బదులిస్తూ... మజుందార్‌ షా రోడ్లను అభివృద్ధి చేయాలనుకుంటే చేయవచ్చు అని డీకే పేర్కొన్నారు. ఆమె వచ్చి అడిగితే.. ఆ గుంతలు పూడ్చేందుకు రోడ్లను కేటాయిస్తామన్నారు. ఈ సందర్భంగా బెంగళూరు నగర అభివృద్ధికి తమ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించిందన్నారు. బెంగళూరులో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్నారు. మౌలిక సదుపాయాలకు అవసరమైనవన్నీ చేస్తున్నామన్నారు.

అంతకుముందు, కర్ణాటక రాజధాని బెంగళూరులో అస్తవ్యస్త పరిస్థితులను బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజుందార్‌ షా ట్విట్టర్‌ వేదికగా..‘చెత్త కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లోని ఏ మున్సిపాల్టీ కూడా దీనిని పరిష్కరించడం లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు లాంటి నగరాల్లో ఈ చెత్త సమస్య చాలా చాలా దయనీయంగా ఉంది’ అని పేర్కొన్నారు.

అయితే, బెంగళూరులో పరిస్థితుల్లో గతంలో కూడా ‘బ్లాక్‌బక్‌’ అనే కంపెనీ సీఈఓ రాజేశ్‌ యాబాజీ కూడా గతంలో ఓ పోస్టు పెట్టారు. రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. తాజాగా బయోకాన్‌ పార్క్‌కు వచ్చిన ఓ విదేశీ విజిటర్‌.. నగరంలోని రోడ్లు, చెత్తపై చేసిన వ్యాఖ్యలతో తాను ఇబ్బందిపడ్డానని  పోస్టులో వెల్లడించారు. దీంతో, ఆమె పోస్టు వైరల్‌ అయ్యింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement