
నదులు ఉప్పొంగి..
రాష్ట్రంలో ప్రధానమైన కృష్ణా, ఉపనదులు, తుంగభద్ర, ఉపనదులు, కావేరి నదులు పొంగి ప్రవహించడంతో పరిసరాల్లోని వేలాది ఎకరాల పంటలు గంగార్పణం అయ్యాయి. అలాగే కుండపోత వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లోని పొలాలు, తోటలు దెబ్బతిన్నాయి. రోజుల తరబడి నీటిలో ఉండడంతో పంటలు కుళ్లిపోయినట్లు రైతులు తెలిపారు. రైతులు ప్రతి ఎకరాకు రూ.15 వేల నుంచి 20 వేల వరకు ఖర్చు చేశారు. ఇప్పటికే అప్పుల భారంతో ఉండగా, ఈ కుండపోత మరింత రుణభారాన్ని పెంచిందని సన్న, చిన్నకారు రైతులు లబోదిబోమంటున్నారు.
బెళగావి వద్ద వరిపొలం