
చాముండి కొండ హిందువులదే
మైసూరు: మైసూరులోని చాముండి కొండ, అక్కడి దేవస్థానం అన్నీ హిందువులకు చెందినవని, రాజకీయ నాయకులు ఏం చెప్పినా అవేమీ కావు అని మైసూరుకు చెందిన రాజవంశీకురాలు ప్రమోదాదేవి ఒడెయర్ మరోసారి స్పష్టం చేశారు. శనివారం ఆమె నగరంలో విలేకరులతో మాట్లాడారు. చాముండి బెట్ట హిందువులకు చెందినదని, చాముండేశ్వరి హిందూ దేవత, యదువంశానికి చాముండిదేవి ధార్మిక మాతలాంటిదని, హిందూ ధార్మిక విధివిధానాల ప్రకారం పూజలు జరుగుతాయని తెలిపారు. చాముండి బెట్ట హిందువుల ఆస్తి కాదు అని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇటీవల ప్రకటించడం, మైసూరు దసరా ఉత్సవాలను ప్రముఖ రచయిత్రి బాను ముష్తాక్‌చే ప్రారంభించాలని నిర్ణయం మీద వివాదం రేగుతున్న సంగతి తెలిసిందే. దేవస్థానం విషయంపై కోర్టులో తమ పోరాటం సాగుతోందని ప్రమోదాదేవి చెప్పారు. ప్రభుత్వం చాముండేశ్వరి అభివృద్ధి ప్రాధికారను ఏర్పాటు చేసినా అది అధికారికం కాదన్నారు. 70 ఏళ్లుగా ఈ పోరాటం కోర్టులో నానుతోందన్నారు. దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకుంటారా? అని ఆవేదన చెందారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు మారుతుంటాయి, దసరా వేడుకల ప్రారంభకులపై తన అభిప్రాయం ఏమీ లేదన్నారు.
దర్శన్ జైలు బదిలీపై అర్జీ
దొడ్డబళ్లాపురం: రేణుకాస్వామి హత్య కేసులో ప్రముఖ నటుడు దర్శన్ మళ్లీ అరైస్టె తిరిగి బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుపాలైన సంగతి తెలిసిందే. దర్శన్‌ను బళ్లారి జైలుకి తరలించాలని కోరుతూ పోలీసుశాఖ బెంగళూరు సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసింది. విచారణకు తీసుకున్న కోర్టు సెప్టెంబరు 2కి విచారణ వాయిదా వేసింది. ఇక చెరసాలలో దర్శన్‌కు దిండు, బెడ్‌షీట్ ఇతర సౌకర్యాలు కల్పించేలా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తరఫు లాయర్ అర్జీ వేశారు.
కూతురిని కడతేర్చిన తండ్రి
● కులాంతర ప్రేమ గొడవ..
● కలబుర్గి జిల్లాలో పరువు హత్య
సాక్షి, బళ్లారి: పరువు పేరిట కన్న తండ్రే హంతకుడయ్యాడు, వేరే కులానికి చెందిన యువకున్ని ప్రేమించిందని ఓ కిరాతకుడు కూతురిని హతమార్చిన ఘటన కలబుర్గి జిల్లాలో జరిగింది. మేళకుంద గ్రామానికి చెందిన కవిత కొల్లూరు (19) అగ్రవర్ణ యువతి, అదే గ్రామానికి చెందిన మాళప్ప పూజారి అనే బీసీ కులానికి చెందిన యువకున్ని ప్రేమించింది. అతడు ఆటోడ్రైవర్‌గా పనిచేసేవాడు. వద్దని తల్లిదండ్రులు పలుమార్లు హెచ్చరించినా కవిత ప్రేమ వ్యవహారాన్ని కొనసాగించింది.
పురుగుల ముందు పోసి..
ఆక్రోశంతో రగిలిపోయిన తండ్రి శంకర్.. బుధవారంనాడు కూతురిపై దాడి చేసి గొంతు పిసికి ప్రాణాలు తీశాడు. నోట్లోకి పురుగుల మందును పోసి.. ఆత్మహత్య చేసుకుందని కట్టుకథ అల్లారు. తరువాత అంత్యక్రియల పేరుతో మృతదేహాన్ని కాల్చివేశారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో సమగ్ర తనిఖీ చేయగా కూతురిని తండ్రితో పాటు మరో ఇద్దరు కలిసి హత్య చేసినట్లు తేలింది. శుక్రవారంనాడు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
రాజమాత ప్రమోదాదేవి