
క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం
కోలారు : క్రీడలతో మానసిక, శారీరక ఆరోగ్యం లభిస్తుందని బీఈఓ మధుమాలతి అన్నారు. నగరంలోని విశ్వేశ్వరయ్య క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన వక్కలేరి ఫిర్కా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. నిత్యం నాలుగు గోడలకే పరిమితమైతే విద్యార్థులలో ఆసక్తి తగ్గుతుందన్నారు. విద్యార్థులు క్రీడల్లో కూడా పాల్గొనడానికి తల్లిదండ్రులు ప్రోత్సాహం అందించాలన్నారు. క్రీడలు విద్యార్థులలో ఆత్మస్థైర్యాన్ని నింపుతాయన్నారు. సూలూరు గ్రామ పంచాయతీ అధ్యక్షుడు పెమ్మశెట్టిహళ్లి సురేష్, శిక్షణా సంయోజకుడు శ్రీనివాస్, అరాభికొత్తనూరు గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు రేణుకాంబ మునిరాజు తదితరులు పాల్గొన్నారు.