
నాణ్యమైన పాలను అందించాలి
కోలారు : పాడి రైతులు పాల సమాఖ్యకు నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసి అందించాలని కోముల్ డైరెక్టర్ మహాలక్ష్మీ ప్రసాద్‌బాబు సూచించారు. తాలూకాలోని చదువనహళ్లిలో శనివారం మహిళా పాల డెయిరీ సర్వసభ్య సమావేశం జరిగింది. మహాలక్ష్మి ప్రసాద్ పాల్గొని మాట్లాడారు. కోముల్ సమాఖ్య దాణాను సరఫరా చేస్తుందని, దాని ద్వారా పాల దిగుబడిని పెంచుకోవాలన్నారు. పాల సమాఖ్య బలోపేతానికి పాడి రైతులు తమ వంతు సహకారం అందించాలన్నారు. అనంతరం పాడి రైతులకు పలు పథకాల కింద చెక్కులు పంపిణీ చేశారు. పాల సంఘం అధ్యక్షురాలు మంజుల, కోముల్ డిప్యూటీ మేనేజర్ డాక్టర్ మహేష్, విస్తరణాధికారి రామాంజనప్ప తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలు, జలసంరక్షణకు ప్రాధాన్యత
కోలారు: గ్రామాల్లో పరిసర, జల సంరక్షణకు కృషి చేయాలని జెడ్పీ సీఈఓ ప్రవీణ్ పి బాగేవాడి సూచించారు. గ్రామ పంచాయతీ పీడిఓలు, పంచాయతీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులకు శనివారం జిల్లా పంచాయతీ భవనంలో నిర్వహించిన కార్యాగారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన జీవవైవిధ్యతా సమితులను క్రియాశీలం చేయాలన్నారు. తాలూకా స్థాయిలో వాతావరణ క్రియా సమితులను రచించి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు. వాతావరణంలో జరుగుతున్న మార్పులపై గ్రామ స్థాయిలో అవగాహన కలిగించాలన్నారు. వివిధ శాఖల సమస్వయంతో కార్య ప్రణాళికలు రూపొందించాలని సిఫారసు చేశారు. గ్రామాలలో ప్లాస్టిక్ వాడకం సంపూర్ణంగా నిషేధించాలన్నారు. ప్రతి పాఠశాలలో పరిసరాల రక్షణ క్లబ్ ఏర్పాటు చేసి పర్యావరణంపై పిల్లలలో అవగాహన కలిగించాలన్నారు. ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున ఉద్యానవనం స్థాపించాలని అన్నారు. కార్యక్రమంలో పాత్రికేయుల సంఘం జిల్లా అధ్యక్షుడుగోపినాథ్, జిల్లా పంచాయతీ ఉప కార్యదర్శి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
చిక్కబళ్లాపురం: నగరంలోని పర్యాటక మందిరం ఆవరణలో శిడ్లఘట్ట ఎమ్మెల్యే రవికుమార్ శనివారం 24 మంది దివ్యాంగులకు ద్విచక్ర వాహనాలు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. జలజీవన పథకం పనులు నాసిరకంగా జరిగాయని, దీనిపై సీఈఓకు ఫిర్యాదు చేస్తానన్నారు. దివ్యాంగుల సంక్షేమశాఖ అధికారిణి జ్యోతిలక్ష్మి, ఎంఆర్‌డబ్ల్యూ రామచంద్ర, మంజునాథ్, పీఎల్‌డీ బ్యాంకు అధ్యక్షుడు బంక్ మునియప్ప పాల్గొన్నారు.

నాణ్యమైన పాలను అందించాలి

నాణ్యమైన పాలను అందించాలి