
యువత స్వయం ఉపాధికి సహకారం అందిస్తాం
కోలారు : స్కౌట్స్ అండ్ గైడ్స్ స్వయం ఉపాధి వైపు ఆసక్తి కనబర్చాలని ఆ సంస్థ రాష్ట్ర చీఫ్ కమిషనర్, మాజీ మంత్రి పీజీఆర్ సింధియా సూచించారు. నగరంలోని స్కౌట్స్ భవనంలో శనివారం ఏర్పాటు చేసిన మూడు రోజుల రాష్ట్ర స్థాయి వృత్తి కౌశల్య శిబిరాన్ని సింధియా ప్రారంభించి మాట్లాడారు. సుస్థిర సమాజ అభివృద్ధికి సంస్థ పలు కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. విద్యాభ్యాసం చేసిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లభించవన్నారు. యువకులు తమ గ్రామ, పట్టణ ప్రాంతాలలో డిమాండ్‌కు అనుగుణంగా ఉద్యోగాలను సృష్టించుకొని ఇతరులకు ఉపాధి కల్పించాలన్నారు. ఇందుకు స్కౌట్స్ సంస్థ సహకారం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా ముఖ్య కమిషనర్ కేవీ శంకరప్ప, జిల్లా సహకార్యదర్శి స్కౌట్ బాబు, జిల్లా కమిషనర్ సురేష్, జిల్లా కార్యదర్శి నారాయణస్వామి పాల్గొన్నారు.