
హంపీకి పోటెత్తిన పర్యాటకులు
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీకి పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. శని, ఆది, సోమవారాల్లో 50 వేల మందికి పైగా పర్యాటకులు స్మారకాలను సందర్శించారు. హంపీలోని విరుపాక్షేశ్వరాలయం, ఎదురు బసవన్న ఆలయం, కడలెకాళు గణపతి, సాసివెకాళు గణపతి, శ్రీకృష్ణ ఆలయం, ఉద్దాన వీరభద్రేశ్వరాలయం, బడవిలింగ, ఉగ్రనరసింహ, నెలస్తర శివాలయం, అక్క తంగి రామన్న గుడి, కమల్ మహల్, హజారరామ దేవస్థానం, మహానవమి దిబ్బ, రాణిస్నాన గృహం, కోట ఆంజనేయ, సరస్వతి ఆలయం, పట్టాభిరామ ఆలయం, మాల్యవంత రఘునాథ ఆలయం, భీమ ద్వారం, గెజ్జల మంటపం, విజయ విఠల ఆలయం, రాతి రథం, సీతా సెరుగు, పురంధర దాస మంటపం, విష్ణు మంటపం, కోదండ గోరంభ దేవాలయం, కంపభూప మార్గ్, పాన్ సుపారీ బజార్, వివిధ స్మారకాలను వీక్షించారు.

హంపీకి పోటెత్తిన పర్యాటకులు