
బియ్యం అక్రమ రవాణా.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రాయచూరు రూరల్: అక్రమంగా బియ్యం రవాణా చేస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసిన ఘటన కలబుర్గిలో చోటు చేసుకుంది. శనివారం ఆళంద రోడ్డులోని విశ్వరాధ్య ఆలయం వద్ద బియ్యం మిల్లుల నుంచి 4420 కేజీల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆహార పౌర సరఫరాల శాఖ అధికారిణి అర్చన, పోలీసులు దాడిలో పాల్గొనగా, లారీ డ్రైవర్ అణ్ణారావ్ కంటెప్ప, క్లీనర్ గురుదేవ్ ఏపీ–04 టీయూ–5230 నంబరుగల లారీలో రవాణా చేస్తున్న బియ్యం విలువ సుమారు రూ.1.50 లక్షలు ఉంటుందని నిర్ణయించారు.
గ్రంథాలయ లబ్ధి పొందండి
హుబ్లీ: గ్రంథాలయం, అరివు కేంద్రాన్ని ఆ జీపీ సభ్యురాలు గంగవ్వ బంగ్లి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ హలగేరి జీపీ ద్వారా నిర్మించిన గ్రంథాలయం వల్ల విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కానుందన్నారు. చదువుకునే అలవాటు తగ్గుతున్న తరుణంలో గ్రంథాలయం ఏర్పాటు వల్ల సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ప్రముఖులు యల్లప్ప, విరుపమ్మ, పీడీఓ అశోక్, గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.