
మృతురాలు హిందూపురం వాసి
హిందూపురం: చిక్కబళ్లాపురం జిల్లా మంచేనహళ్లి వద్ద అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన మహిళ ఆచూకీ లభ్యమైంది. ఆమెను శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని శ్రీకంఠపురానికి చెందిన వడ్డే అర్చన (26)గా పోలీసులు గుర్తించారు. ఆమె 16న ఇంటినుంచి బయటకు వెళ్లి రాకపోవడంతో భర్త నాగరాజు హిందూపురం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంచేనహళ్లిలో గుర్తు తెలియని మహిళ శవమై తేలినట్లు సమాచారం అందడంతో పోలీసులు నాగరాజును పిలుచుకొని వెళ్లగా మృతురాలు అర్చనగా తేలింది. అయితే ఈమె అక్కడికి ఎలా చేరింది, ఏమి జరిగిందనేది పూర్తిగా తెలియరాలేదు. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.