
లింగనమక్కికి వాయనం ఇవ్వరే?
శివమొగ్గ: రాష్ట్రంలోనే అతిపెద్ద జలాశయం. ఇది శరావతి నదిపై ఉంది. విద్యుదుత్పత్తితో రాష్ట్రానికి, దేశానికి వెలుగులిస్తోంది. ఆసియాలోనే అతి తక్కువ ఖర్చుతో విద్యుత్‌ను ఉత్పత్తి చేసేది అయిన సాగర్ తాలూకాలోని లింగనమక్కి డ్యాం ఈ ఏడాది కూడా నిండి కళకళలాడుతోంది. దీంతో మంగళవారం ఉదయం 11 గేట్లను ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్‌ప్లో 48,393 క్యూసెక్కులుగా ఉంది. డ్యాం సామర్థం 151 టీఎంసీలు అయితే 142 టీఎంసీలు నీళ్లున్నాయి.
చేసిన పాపమేమిటి?
రాష్ట్రంలోని తుంగభద్ర, ఆల్మట్టి, కేఆర్‌ఎస్ వంటి ప్రధాన ఆనకట్టలు నిండినప్పుడు ముఖ్యమంత్రి, మంత్రులు డ్యాంకు వచ్చి వాయనం సమర్పించి పూజలు చేస్తారు. కానీ ఇటీవలి సంవత్సరాలలో సీఎం, మంత్రులు ఎవరూ లింగనమక్కి ముఖం చూడడం లేదు. అధికార ప్రముఖులు ఈ ఆనకట్టకు వాయనం ఇవ్వడానికి ఇష్టపడరు అని స్థానికులు ఆవేదన చెందారు. లింగనమక్కి చేసిన పాపం ఏమిటో చెప్పాలని పాలకులను ప్రశ్నించారు. సీఎం, మంత్రులు ఈసారైనా లింగనమక్కిని గౌరవించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అటువైపు చూడని పాలకులు
ప్రజల ఆవేదన