
పండ్లు, కూరగాయల మార్కెట్లను తరలించాలి
బళ్లారి అర్బన్: ఏపీఎంసీలోని పండ్లు, కాయగూరల మార్కెట్‌లను వేరే చోటకు తరలించాలని బళ్లారి ఏపీఎంసీ ట్రేడర్స్ అసోసియేషన్ జిల్లాధ్యక్షుడు మెణసిన ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. ఆయన ఏపీఎంసీ శాఖ మంత్రి శివానంద పాటిల్‌కు రాసిన వినతిపత్రాన్ని జిల్లాధికారి కార్యాలయంలో అధికారికి అందజేసి మాట్లాడారు. ఏపీఎంసీ మార్కెట్ ఉన్నది రైతుల వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడానికని అన్నారు. అయితే స్థలాభావం వల్ల రైతులు తమ ఉత్పత్తులను రోడ్డులో వేయడం వల్ల ఆటోలు, లారీలు వాటి మీదుగా వెళ్లడంతో రైతులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. పండ్లు, కూరగాయల మార్కెట్ పశువుల సంతలా మారాయని, తక్షణమే వేరే చోటకు తరలించాలన్నారు. ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి వసంత్ కుమార్, ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు పాలన్న, అరవిందం, కన్ని శివమూర్తి, ప్రహ్లాద్, విజయ్‌కుమార్, మనోజ్‌కుమార్, నరసింహులు, వినోద్‌కుమార్, పదాధికారులు పాల్గొన్నారు.