
తిరంగా అభియాన్‌తో దేశభక్తి వృద్ధి
బళ్లారి అర్బన్: హర్ ఘర్ తిరంగా అభియాన్ ప్రజల్లో దేశభక్తిని పెంపొందిస్తుందని సేవారత్న ప్రశస్తి గ్రహీత, మాజీ సైనికుడు పీ.ప్రహ్లాదనాథరెడ్డి తెలిపారు. తంజావూరులోని దక్షిణ వలయ సాంస్కృతిక కేంద్రం తిప్పేరుద్ర విద్యా సంస్థ, మనుకుల ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో ఏర్పాటు చేసిన హర్ ఘర్ తిరంగా ప్రచారం– 2025 సందర్భంగా సాంస్కృతిక, తోలుబొమ్మలాట ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జాతీయ పతాకంలోని మూడు రంగులైన కేసరి, తెలుపు, పచ్చరంగులు త్యాగం, శాంతి, సమృద్ధికి సంకేతమన్నారు. ఏ కులమైనా, మతమైనా ముందుగా మనమందరం భాతీయులమన్న అంశాన్ని మరువరాదన్నారు. జాతీయ పండుగలు అన్ని ప్రైవేటు, ప్రభుత్వ సంస్థలు నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరు ఇంటి పండుగలా జెండా పండుగను జరుపుకోవాలని సూచించారు. కళ్యాణస్వామి మఠం కళ్యాణస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ వసతులు ప్రయోజనం పొందే ప్రతి ఒక్క పౌరులు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి గౌరవ వందనం సమర్పించి దేశ భక్తిని చాటాలన్నారు. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం నగర కన్వీనర్ డీకే.నిర్మలక్క, కసాపా మాజీ జిల్లా అధ్యక్షుడు రామకల్మఠ, అధికారి సుందర్ భాస్కర్‌తో పాటు ఎస్‌జీటీ సమూహ విద్యా సంస్థల అధ్యక్షుడు ఎస్‌ఎన్.రుద్రప్ప, ఎస్‌జీటీ సమూహ సంస్థ కార్యదర్శి జీ.నాగరాజు, సంబంధిత అధికారులు, సిబ్బంది తదిరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ జాతీయ పతాకాలను పంపిణీ చేశారు.
హర్ ఘర్ తిరంగాకు ఎమ్మెల్యే శ్రీకారం
రాయచూరు రూరల్: హర్ ఘర్ తిరంగాకు రాయచూరు నగర ఎమ్మెల్యే శివరాజ్ పాటిల్ శ్రీకారం చుట్టారు. ఆదివారం రాయచూరు నగర శాసన సభ్యుడి కార్యాలయం నుంచి బీజేపీ ఆధ్వర్యంలో ర్యాలీని పచ్చజెండా ఊపి ఆయన ప్రారంభించారు. ప్రజలకు తిరంగా(జాతీయ జెండా) ప్రాధాన్యత గురించి వివరించారు.

తిరంగా అభియాన్‌తో దేశభక్తి వృద్ధి