
కొంగుబంగారం.. మల్లణ్ణ ఆలయం
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆలయాలకు కొదవ లేదు. నదులు, అడవులు, కొండలు, పొదల మధ్య దేవుళ్లు, దేవతలు వెలవడం ఆనవాయితీ. బీదర్ జిల్లా భాల్కి తాలూకా ఖానాపుర వద్ద ప్రకృతి సౌందర్యాల నడుమ వెలసిన శనేశ్వర, గాయముఖ గుప్త లింగేశ్వర, మల్లణ్ణ దేవాలయం అనే మూడు ఆలయాలు ఒకే ప్రాంతంలో ఉండడంతో ప్రజలకు, భక్తులకు దర్శనానికి అనుకూలంగా ఉంది. దేవాలయానికి సమీపంలో 50 అడుగుల లోతు ఉన్న ఆకళబావి పుష్కరణిలో 365 రోజులు నీటితో నిండి ఉంటుంది. మల్లణ్ణ దేవాలయం పక్కనే గాయముఖ గుప్త లింగేశ్వర ఆలయం వద్ద మినీ జలపాతం ఉండడం ఆశ్చర్యంగా భావిస్తున్నారు. సమీపంలోనే ఉన్న శనేశ్వర ఆలయం ప్రకృతి సౌందర్యాలను మరిపిస్తూ భక్తులను ఆకట్టుకుంటోంది. మూడు దేవాలయాల్లో ముగ్గురికి కొబ్బరి, భండారం నైవేద్యంగా సమర్పిస్తారు. పచ్చని చెట్లు, వనాల మధ్య దేవాలయాలుండడంతో శ్రావణ మాసంలో భక్తుల సందడి అధికంగా ఉంది. భక్తులు ప్రకృతి సౌందర్యాల మధ్య తమ ఇష్టదైవాలను భక్తిశ్రద్ధలతో కొలుస్తున్నారు.
దేవాలయాలకు నెలవు కళ్యాణ కర్ణాటక
శ్రావణ మాసంలో భారీగా భక్తుల సందడి

కొంగుబంగారం.. మల్లణ్ణ ఆలయం