
అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం
రాయచూరు రూరల్: గ్రామాల్లో అభివృద్ధికి ప్రజల సహకారం అవసరమని గ్రామీణ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్ పేర్కొన్నారు. ఆయన యరగేర, సగమకుంట, బ్రహ్మిదొడ్డి, మామడ దొడ్డి, కొర్తుకుందలో వివిధ అభివృద్ధి పనులకు భూమిపూజ చేసి మాట్లాడారు. భవిష్యత్తులో గ్రామాలను సుందరంగా తీర్చిదిద్దడానికి పాటుపడతామన్నారు. ప్రతి ఒక్కరూ విద్య, వైద్య, ఆరోగ్య సదుపాయాలపై జాగ్రత్త వహించాలన్నారు.
హంపీలో పర్యాటకుల సందడి
హొసపేటె: ప్రపంచ ప్రఖ్యాత హంపీకి సోమవారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. శని, ఆది, సోమవారాల్లో 50 వేలకు పైగా పర్యాటకులు స్మారకాలను సందర్శించారు. హంపీలోని విరుపాక్షేశ్వరాలయం, ఎదురు బసవణ్ణ ఆలయం, వేరుశేనగ గణపతి, ఆవాల గణపతి, శ్రీకృష్ణ ఆలయం, ఉద్దాన వీరభద్రేశ్వర ఆలయం, బడవిలింగ, ఉగ్రనరసింహ, నెలస్తార శివాలయం, అక్క తంగి రామన్న గుడి, కమల మహల్, హజారరామ దేవస్థానం, మహానవమి దిబ్బ, రాణిస్నాన గృహం, కోట ఆంజనేయ, సరస్వతి ఆలయం, పట్టాభిరామ ఆలయం, మాల్యవంత రఘునాథ ఆలయం, భీమ ద్వారం, గెజ్జల మంటపం, విజయ విఠల ఆలయం, రాతిరథం, సీతాసెరుగు, పురందరదాస మంటపం, విష్ణు మంటపం, కోదండ గోరంబ ఆలయం, కోదండ గోరంబ ఆలయం, కంప భూప మార్గ్, పాన్‌సుపారీ బజార్ తదితర స్మారకాలను వీక్షించారు.
పిడుగుపాటుకు
మహిళ దుర్మరణం
రాయచూరు రూరల్: గత రెండు రోజుల నుంచి గ్రామీణ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈనేపథ్యంలో పిడుగుపాటుకు గురై మహిళ దుర్మరణం పాలైన ఘటన యరగేరలో చోటు చేసుకుంది. ఆదివారం సాయంత్రం రాయచూరు తాలూకా యరగేర వద్ద పొలంలో పనులు చేస్తుండగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుతో భవాని(26) అనే మహిళ అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు.

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం

అభివృద్ధికి ప్రజల సహకారం అవసరం