
లారీకి నవ వివాహిత బలి
బనశంకరి: వరమహాలక్ష్మీ పండుగనాడు బంధువుల ఇంటికి వెళుతున్న నవ వివాహిత ప్రమాదంలో ప్రాణాలు వదిలింది. ఈ ఘటన బెంగళూరు రాజాజీనగర ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. వివరాలు.. గీత (23) అనే యువతికి రెండునెలల క్రితం సునీల్ అనే వ్యక్తితో పెళ్లయింది. శుక్రవారం వరమహాలక్ష్మీ పండుగ కావడంతో పసుపు కుంకుమ తీసుకోవడానికి నందిని లేఔట్‌లోని బంధువుల ఇంటికి దంపతులు బైకులో బయలుదేరారు. లగ్గెరె బ్రిడ్జి వద్ద బైకు ను లారీ ఢీకొనగా తలకు తీవ్రగాయం కావడంతో గీతా అక్కడే చనిపోయింది. భర్తకు గాయాలయ్యాయి. పోలీసులు లారీడ్రైవరు సురేశ్‌ను అరెస్ట్ చేశారు.