
నమో నారసింహా
● కంబద ఆలయంలో
శ్రావణ శనివార పూజలు
మండ్య: నమో నారసింహా.. నమో భక్తపాల అని భక్తులు స్తుతించారు. శ్రావణ మాసం మూడవ శనివారం సందర్భంగా మండ్య నగరంతో పాటు జిల్లాలో ఉన్న విష్ణుమూర్తి, వెంకటేశ్వరస్వామి ఆలయాలలో విశేష పూజలు జరిగాయి. మండ్య తాలూకాలోని సాతనూరు బెట్ట కంబద నరసింహస్వామి గుడిలో తెల్లవారుజాము నుంచే పూజలు చేశారు. నరసింహ స్వామివారి విగ్రహానికి వివిధ రకాల పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయం వెనుక భాగంలో ఉన్న మహాలక్ష్మి మందిరంలో కరెన్సీ నోట్లతో అమ్మవారికి సుందరంగా తీర్చిదిద్దారు. వందలాదిగా భక్తులు దేవీ దేవతలను దర్శించుకున్నారు.

నమో నారసింహా

నమో నారసింహా

నమో నారసింహా