
మహిళలకు అండగా మాతృవందన
హొసపేటె: తల్లుల ఆరోగ్యం, శ్రేయస్సు కోసం కేంద్ర ప్రభుత్వం మాతృవందన పథకాన్ని మహిళలకు బహుమతిగా ఇచ్చిందని మహిళా శిశు అభివృద్ధి పథకం అధికారిణి సింధు అంగడి తెలిపారు. తాలూకాలోని హళే మలపనగుడి అంగన్‌వాడీ–2వ కేంద్రంలో నిర్వహించిన మాతృవందన శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. పాలిచ్చే తల్లులు పౌష్టికాహారం తినాలని, ఆరోగ్య సంరక్షణకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని అవగాహన కల్పించారు. మలపనగుడి పీడీఓ హనుమంతప్ప, అంగన్‌వాడీ కార్యకర్త మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.