నేత్రపర్వం.. మహా రథోత్సవం
బళ్లారిఅర్బన్: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో చేళ్లగుర్కిలో వెలసిన శ్రీఎర్రితాత మహా రథోత్సవం ఆదివారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. ప్రతి ఏటా ఆనవాయితీ మాదిరిగా మహా రథోత్సవం ఈ ఏడాది కూడా సప్త భజనలతో ప్రారంభమై ఎర్రితాతకు వెండి ఆభరణాలు, పూలతో అలంకరణ పూజలు చేసి భక్తులకు దర్శనం కల్పించారు. సాయంత్రం మహా రథోత్సవం సందర్భంగా ఆలయంలో అగ్ని దీపాలతో భక్తులు 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కులను తీర్చుకున్నారు. మహా రథోత్సవంలో వివిధ సాంస్కృతిక కళా బృందాలు పాల్గొని అందరినీ ఆకట్టుకున్నాయి. రథోత్సవాన్ని తిలకించేందుకు పైళ్లెన కొత్త జంటలు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వేలాది మంది భక్తులు భారీ ఎత్తున పాల్గొన్నారు.
చేళ్లగుర్కి ఎర్రితాతకు ఆభరణాల అలంకరణ
వేలాదిగా పాల్గొన్న చుట్టుపక్కల భక్తులు
నేత్రపర్వం.. మహా రథోత్సవం


