వృథా ప్రకటనలు మానుకోవాలి
రాయచూరు రూరల్: నాయకులు వృథా ప్రకటనలను ఇవ్వడం మాని నిజమైన మాదిగలకు న్యాయం చేకూర్చాలని, రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణకు నాయకులే అడ్డంకి అని అంబేడ్కర్ పీపుల్స్ పార్టీ అధ్యక్షుడు దేవమిత్ర పేర్కొన్నారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే, ఆంజనేయ, ప్రియాంక్ ఖర్గే అంటరానితనం నిర్మూలనకు కృషి చేయకుండా అంబేడ్కర్ ఆశయాలకు తిలోదకాలిస్తున్నారన్నారు. మాజీ మంత్రి ఆంజనేయ తాను మాదిగ అని ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఇతర కులాలను ఎస్సీ జాబితాలో చేర్చడం తగదన్నారు.


