బెంగళూరుకు జవాన్ భౌతికకాయం
దొడ్డబళ్లాపురం: జమ్ము కశ్మీర్‌లో వీరమరణం పొందిన ఏపీలోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలానికి చెందిన ఆర్మీ జవాన్ మురళి నాయక్ భౌతికకాయం శనివారంనాడు బెంగళూరులోని కెంపేగౌడ విమానాశ్రయానికి చేరుకుంది. ఢిల్లీకి, అక్కడి నుంచి బెంగళూరుకు ప్రత్యేక విమానంలో తీసుకువచ్చారు. బెంగళూరు ఎయిర్‌పోర్టుకు చేరగానే సైనిక సిబ్బంది ఘనంగా నివాళులు అర్పించి ఆర్మీ అంబులెన్స్‌లో రోడ్డు మార్గాన మురళి స్వగ్రామానికి తరలించారు.
సైనికునికి వీడ్కోలు
చిక్కబళ్లాపురం: జవాన్ మురళీ నాయక్ భౌతికకాయం తరలిస్తున్న అంబులెన్సు చిక్కబళ్లాపురానికి చేరుకోగా ప్రజలు పెద్దసంఖ్యలో చేరి నివాళులు అర్పించారు. జాతీయ రహదారి 7లో ప్రజలు, యువకులు తరలివచ్చి జవాన్ అమర్ రహే అని నినాదాలు చేశారు.
బెంగళూరుకు జవాన్ భౌతికకాయం


