కలబుర్గి జైలులో జల్సాలు
దొడ్డబళ్లాపురం: కలబుర్గి సెంట్రల్ జైలులో ఖైదీలకు సకల భోగాలు అందుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ మేరకు ఓ వీడియో ప్రచారంలోకి వచ్చింది. ఖైదీలు మద్యం తాగుతూ, సిగరెట్ కాలుస్తూ ఇస్పేటు ఆడుతున్న దృశ్యాలు వీడియోలో ఉన్నాయి. ఇదే జైలులో ఎస్‌ఐ ఉద్యోగాల కుంభకోణాల సూత్రధారి ఆర్‌డీ పాటిల్ కూడా ఉన్నాడు. పోలీసులు జైలులో తనిఖీలు చేపట్టగా ఖైదీల వద్ద ఎటువంటి మద్యం సీసాలు, సిగరెట్లు లభించలేదు. ముందే వాటిని దాచినట్టు అనుమానాలు ఉన్నాయి.
త్వరలోనే బెంగళూరు– మంగళూరు మధ్య వందేభారత్
యశవంతపుర: త్వరలో సిలికాన్ సిటీ బెంగళూరు– రేవు నగరి మంగళూరుల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసును ప్రారంభించనున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయమంత్రి వి.సోమణ్ణ చెప్పారు. ఈ మార్గంలో రైల్వే లైన్ విద్యుదీకరణ పనులు పూర్తయినట్లు చెప్పారు. ప్రజల నుంచి డిమాండు ఉంది, వందే భారత్ రైలు పూర్తిగా విద్యుత్‌తో నడుస్తుంది, ఈ మార్గంలో హాసన్ జిల్లా సకలేశపుర నుంచి సుబ్రమణ్య ఘాట్ వరకు విద్యుత్ మార్గం లేదు. దీంతో ఆ రెండు ప్రాంతాల మధ్య 55 కిలోమీటర్లు విద్యుద్దీకరణ పనులను పూర్తి చేయించాం. గత డిసెంబర్ 28న ఎలక్ట్రిక్ లోకోమోటివ్ సంచారాన్ని పరీక్షించారు అని తెలిపారు. రోజుకు మూడు వందే భారత్ రైళ్లు రెండు సిటీల మధ్య సంచరించే అవకాశముంది.
కలబుర్గి జైలులో జల్సాలు
కలబుర్గి జైలులో జల్సాలు
కలబుర్గి జైలులో జల్సాలు
కలబుర్గి జైలులో జల్సాలు
కలబుర్గి జైలులో జల్సాలు


