హత్య కేసు నిందితుల్ని అరె్‌స్ట్ చేయరూ
రాయచూరు రూరల్: ధార్వాడ జిల్లా హుబ్లీలో జరిగిన పరువు హత్య కేసులో నిందితులను అరె్‌స్ట్ చేయాలని రాష్ట్ర చలవాది మహాసభ మహిళా విభాగం జిల్లాధ్యక్షురాలు అర్చన డిమాండ్ చేశారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో ఆమె మాట్లాడారు. ప్రేమ పేరుతో ఎస్సీ వర్గానికి చెందిన వివేకానందతో కులాంతర వివాహం చేసుకున్న ఆరోణలపై ఏడు నెలల గర్భం ధరించిన మాన్య పాటిల్‌ను తల్లిదండ్రులు దారుణంగా హత్య చేయడాన్ని ఖండించారు. మాన్య పాటిల్‌ను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేయడంలో పోలీస్ యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. వివేకానంద కుటుంబానికి పోలీస్ భద్రత కల్పించాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఆందోళనలో లక్ష్మి, మీనాక్షి, రత్నమ్మ, ఉమాదేవి, నందిని, గణపతి, ప్రియ దర్శిని, నరసింహులు, ఈరణ్ణలున్నారు.


