రెండుచోట్ల బస్సు ప్రమాదాలు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు సమీపంలో ఆనేకల్ తాలూకా చందాపుర వద్ద ప్రైవేటు స్లీపర్ బస్సు ప్రమాదానికి గురైంది. బెంగళూరు నుంచి చైన్నెకి బయలుదేరిన స్లీపర్ బస్సు చందాపుర వద్ద ఫ్లై ఓవర్ పై ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి మరో బస్సును ఢీకొంది. దీంతో బస్సులో ఉన్న నలుగురు ప్రయాణికులు గాయపడ్డారు. సూర్యసిటీ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
లారీని ఆర్టీసీ బస్సు..
లారీ, బస్సు ముఖాముఖి ఢీకొన్న ప్రమాదంలో బస్సు డ్రైవర్ కాలు తెగిపడ్డ సంఘటన బెళగావి–రాయచూరు రాష్ట్ర రహదారి మార్గంలోని లోకాపుర వద్ద జరిగింది. వేగంగా వెళ్తున్న కేఎస్ ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చిన లారీని ఢీకొంది. ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. బస్సు డ్రైవర్ లోపలే చిక్కుకోగా అతడి కాలు తెగిపోయింది.పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను లోకాపుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
డ్రైవర్ సహా
పలువురికి గాయాలు
రెండుచోట్ల బస్సు ప్రమాదాలు


