గుప్త నిధుల కోసం తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Apr 28 2025 7:08 AM | Updated on Apr 28 2025 7:14 AM

రాయచూరురూరల్‌: సదర్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కోటలో కొండపై ఉన్న ఆలయంలో శనివారం రాత్రి దుండగులు గుప్త నిధుల కోసం తవ్వకాలు చేపట్టారు. ఈ సందర్భంగా విగ్రహాలను ధ్వంసం చేశారు. కొన్ని కట్టడాలను తొలగించారని సీఐ ఉమేష్‌ తెలిపారు. శబ్దాలు విన్న స్థానికులు అప్రమత్తం కావడంతో దుండగులు ఉడాయించారేని తెలిపారు. దుండగుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

గనుల శాఖ అధికారిణిపై సస్పెన్షన్‌ వేటు

రాయచూరు రూరల్‌: జిల్లాగనుల శాఖాధికారిణి పుష్పాను సస్పెండ్‌ చేస్తు జిల్లాధికారి నీతీష్‌ అదేశాలు జారీ చేశారు. గత నెలలో మాన్వి తాలూకా చీకల పర్విలో అక్రమంగా ఇసుక రవాణ చేస్తున్న టిప్పర్లు, జేసీబీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే జిల్లా గనుల శాఖాధికారిణి పుష్పా తనకు ఏమీ తెలియనట్లు మౌనంగా ఉండిపోయారని, కనీసం పోలీసులకు ఫిర్యాదు కూడా చేయలేదని ఆరోపణలు వచ్చాయి. అక్రమ రవాణా, తవ్వకాలతో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా సదరు అధికారిణి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని నిర్ధారించి సస్పెండ్‌ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

సెల్‌ఫోన్‌ చూడొద్దంటావా?

భర్త నిద్రలో ఉండగా కత్తితో పొడిచిన భార్య

హుబ్లీ: మొబైల్‌ ఫోన్‌ ఎక్కువ వాడొద్దని చెప్పినభర్తపై భార్య కత్తితో దాడిచేసింది. ఈ ఘటన విజయపురలోని హాలకుంటె నగరంలో చోటు చేసుకుంది. గ్రామంలో అజిత్‌ రాథోడ్‌, తేజు రాథోడ్‌ దంపతులు నివాసం ఉంటున్నారు. తేజు రాథోడ్‌ నిత్యం సెల్‌ఫోన్‌ చూస్తుండేది. గమనించిన భర్త మందలించాడు. దీంతో అతనిపై కోపం పెంచుకుంది. ఆదివారం తెల్లవారుజామున 3గంటల సమయంలో భర్త గాఢ నిద్రలో ఉండగా మెడ భాగంలో కత్తితో దాడి చేసింది. బాధితుడి కేకలు విన్న కుటుంబ సభ్యులు ఆయన్ను బీఎల్‌డీఈ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆదర్శనగర్‌ పోలీసులు తేజు రాథోడ్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

చోరీ సొత్తు అప్పగింత

రాయచూరు రూరల్‌: ఆటోలో మరచిపోయిన నగలను పోలసులు రికవరీ చేసి సొంతదారులకు అప్పగించారు. శక్తినగర్‌కు చెందిన లక్ష్మీ అనే మహిళ ఈ నెల 22 న బస్టాండ్‌ నుంచి తీన్‌కందిల్‌ వరకు ఓ మహిళ అటోలో ప్రయాణించిన సమయంలో సంచి మరచిపోయింది. అందులో బంగారు నగలు ఉన్నాయి. దీంతో బాధితురాలు సదర బజార్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు గాలింపు చేపట్టి ఆటోను గుర్తించి రూ.2 లక్షల విలువ చేసే బంగారు, వెండి నగలను రికవరీ చేశారు. ఆ సొత్తును ఎస్పీ సొంతదారుకు అప్పగించారు. డీఎస్పీ శాంతవీర, సీఐ ఉమేష్‌ నారాయణ కాంబ్లే, ఎస్‌ఐ నరమమ్మ పాల్గొన్నారు.

పీఏబీఆర్‌లో

తగ్గిపోయిన నీటిమట్టం

కూడేరు: కూడేరు మండలం పెన్నహోబిళం బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌(పీఏబీఆర్‌ డ్యాం)లో ఇన్‌ఫ్లో లేక అవుట్‌ ప్లో ఉండడంతో నీటి మట్టం బాగా తగ్గి పోయింది. ఆదివారం నాటికి పీఏబీఆర్‌ డ్యాంలో 2.62 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం ఇరిగేషన్‌ అధికార వర్గాలు వెల్లడించాయి. జలాశయం వద్ద ఏర్పాటైన అనంతపురం, సత్యసాయి, ఉరవకొండ తాగునీటి ప్రాజెక్ట్‌లకు రోజుకు సుమారు 40 క్యూసెక్కులు వరకు నీటిని సరఫరా చేస్తున్నారు. లీకేజీ, నీటి ఆవిరి రూపంలో సుమారు 60 క్యూసెక్కులు వరకు బయటకు వెళుతోంది. వేసవిలో తాగునీటి ప్రాజెక్టులకు నీటి కొరత ఉండదని అధికార వర్గాలు తెలిపాయి.

గుప్త నిధుల కోసం తవ్వకాలు 1
1/4

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు 2
2/4

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు 3
3/4

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు 4
4/4

గుప్త నిధుల కోసం తవ్వకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement