భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం
కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాద పైశాచిక కృత్యానికి బలైన కన్నడిగుడు భరత్ భూషణ్ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బెంగళూరు మత్తికెరెలో ఉన్న భరత్ భూషణ్ ఇంటికి ఉదయం గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, సీఎం సిద్దరామయ్య వెళ్లి భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. భార్య డా.సుజాత, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కశ్మీర్ టూర్ నుంచి కొడుకు సంతోషంగా వెనుతిరిగి వస్తాడని నిరీక్షించిన తల్లి కుమారుని మృతదేహం ముందు శోకసంద్రంలో మునిగిపోయింది. అన్ని పార్టీల ప్రముఖులు తరలివచ్చి శ్రద్ధాంజలి ఘటించారు. భౌతికకాయాన్ని ఊరేగింపుగా తరలించి విద్యుత్ చితాగారంలో దహనక్రియలు పూర్తిచేశారు.
భరత్ భూషణ్ ఇంటికి గవర్నర్, సీఎం


