విలక్షణ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్
బళ్లారి టౌన్: తన అసాధారణ నటనతో విలక్షణ నటుడుగా డాక్టర్ రాజ్‌కుమార్ గుర్తింపు పొందారని అతిథులు పేర్కొన్నారు. గురువారం రాజ్‌కుమార్ ఉద్యానవనంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ జయంతిని అదనపు జిల్లాధికారి మహమ్మద్ జుబేర్ ప్రారంభించి రాజ్‌కుమార్ శిలావిగ్రహానికి పూలమాల వేసి మాట్లాడారు. జాతీయ స్థాయిలో కన్నడ నాడుపై భాషాభిమానం పెంపొందించారన్నారు. తనదైన శైలి నటనతో మంచి చిత్రాల్లో నటించి అపార సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారని గుర్తు చేశారు. కళ్యాణ కర్ణాటక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు సిరిగేరి పన్నారాజు మాట్లాడుతూ రాజ్‌కుమార్ జయంతిని రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అభినందనీయం అని కొనియాడారు. ఏసీ పీ.ప్రమోద్, సమాచార శాఖ అసిస్టెంట్ వీసీ గురురాజ్, వీవీ సంఘం నేతలు బీ.బసవరాజు, కే.ఎర్రిస్వామి, పీ.గాదెప్ప, చంద్రశేఖర్ ఆచార్య, రసూల్ సాబ్, వివిధ కన్నడ పర సంఘాల పదాధికారులు, అభిమానులు పాల్గొన్నారు.
రాజ్‌కుమార్ జీవితం ఆదర్శప్రాయం
హొసపేటె: నేల, నీరు, కన్నడ భాషాభివృద్ధికి అగ్రగామిగా నిలిచిన కన్నడ ప్రసిద్ధ సినీ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్ జీవితశైలి ఆదర్శప్రాయమని అదనపు డిప్యూటీ కమిషనర్ ఈ.బాలకృష్ణప్ప తెలిపారు. గురువారం నగరంలోని జిల్లాధికారి కార్యాలయంలో నిర్వహించిన డాక్టర్ రాజ్‌కుమార్ 97వ జయంతిలో ఆయన పాల్గొని డాక్టర్ రాజ్‌కుమార్ చిత్రపటానికి పూలమాలలు వేసి మాట్లాడారు. ఉత్తమ వ్యక్తిత్వం, వినయానికి ఆదర్శవంతమైన వ్యక్తి రాజ్‌కుమార్ అని అన్నారు. ఆయన కర్ణాటక కళాకారుల సంఘాన్ని స్థాపించి కళాకారుల సంక్షేమాన్ని ప్రోత్సహించారన్నారు. తన అభిమానులను దేవుళ్లుగా పిలిచారన్నారు. ఆయన సినిమాలన్ని సామాజిక పరివర్తనకు దోహదపడేవేనన్నారు. వారి జీవనశైలి, సరళత, వినయం నేటి యువత అలవర్చుకోవాలన్నారు. జిల్లాధికారి కార్యాలయ అధికారులు స్నేహలత, ప్రియదర్శిని, సిబ్బంది శరణప్ప హళ్లికేరి, సమాచార శాఖ సిబ్బంది, రామాంజినేయులు, అశోక ఉప్పార్, కృష్ణ స్వామి, తాయేష్, కిషోర్, దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు.
రాయచూరులో...
రాయచూరు రూరల్: కన్నడ మేరు నటుడు డాక్టర్ రాజ్ కుమార్ జయంతిని ఘనంగా ఆచరించారు. గురువారం కన్నడ భవనంలో ఏర్పాటు చేసిన జయంతిని తహసీల్దార్ సురేష్ వర్మ ప్రారంభించి మాట్లాడారు. కన్నడ భాష, నేల, నీటి కోసం సినిమాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపిన మహా నటుడని కొనియాడారు. కార్యక్రమంలో వార్త సమాచార శాఖాధికారి గవిసిద్దప్ప, లింగరాజ్, దండెప్ప బిరాదార్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
జయంతి కార్యక్రమంలో అతిథులు
విలక్షణ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్
విలక్షణ నటుడు డాక్టర్ రాజ్‌కుమార్


