జొన్నల కొనుగోలుకు గడువు పెంచాలి
బళ్లారిఅర్బన్: రబీ సీజన్‌లో పండించిన జొన్నలను కొనుగోలు చేయడానికి ప్రభుత్దం విధించిన గడువును విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని నగర ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి మంత్రి కేహెచ్.మునియప్పకు ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేశారు. డీసీ కార్యాలయం ఎదుట ఆ సమస్యల పరిష్కారం కోసం రైతులు చేపట్టిన ధర్నాలో పాల్గొన్న ఎమ్మెల్యే వారితో చర్చించారు. వారితో అక్కడే మంత్రి మునియప్పతో ఫోన్‌లో మాట్లాడారు. మంత్రి మునియప్ప ఎమ్మెల్యే కోరికపై సానుకూలంగా స్పందించి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. రాష్ట్ర రైతు సంఘం, హసిరు సేన ఆధ్వర్యంలో డీసీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. ఎమ్మెల్యే నారాభరత్ రెడ్డి రైతుల సమస్యలపై స్పదించారు. రైతు నేతలు మాధవరెడ్డి, మల్లికార్జునరెడ్డి, లేపాక్షి, వీరభద్ర రెడ్డి, నేతృత్వంలో వందలాది మంది రైతులు ధర్నాలో పాల్గొన్నారు. కాగా ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి హామీతో రైతులు ధర్నాను విరమించారు.
కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా


