బళ్లారిఅర్బన్: చిరుప్రాయంలోనే వెండితెరపై ఒక వెలుగు వెలిగి ఆకస్మికంగా గుండెపోటుతో మూడేళ్ల క్రితం దివంగతులైన చందనసీమ నక్షత్రం పునీత్‌రాజ్‌కుమార్ సమాజ సేవ, కళా సేవలను మెచ్చుకొని తాను వారి అభిమాని అయినట్లు అప్పు హోటల్ యజమాని విరుపాక్ష బండిమోట్ తెలిపారు. బెంగళూరు రోడ్డులో రంగమందిరం ఎదురుగా ఉన్న అప్పు హోటల్‌లో పునీత్ రాజ్‌కుమార్ 50వ జయంతి వేడుక సందర్భంగా రక్తదానం, అన్నదాన కార్యక్రమాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. పునీత్ మరణించి మూడేళ్లు గడిచినా తమ అమోఘమైన నటన, అద్భుతమైన సమాజ సేవతో అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఆయన పేరు చిరస్మరణీయంగా ఉండాలన్న ఉద్దేశంతో అప్పు హోటల్‌ను ప్రారంభించానన్నారు. తమ హోటల్‌కు వచ్చే పేదలకు, నిరాశ్రయులకు ఉచిత భోజనం, నిరంతర తాగునీటి సరఫరా సేవలు చేపట్టానన్నారు. చిన్నవయస్సులోనే పెద్దగా రాణించి కన్నడిగుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న పునీత్ రాజ్‌కుమార్ సేవాపథంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. గోపాల్, గౌరీష్, మనోజ్, పవన్, తిప్పేస్వామి, ఉపేంద్ర, ప్రవీణ్, రామకృష్ణ, ప్రకాష్, హనుమంతప్ప తదితర అప్పు అభిమానులు, స్థానికులు పాల్గొన్నారు.
పునీత్ సమాజ సేవ ఆదర్శప్రాయం
రాయచూరు రూరల్: సమాజ సేవకు నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఆదర్శంగా నిలవడం అభినందనీయమని స్పూర్తి డాక్టర్ పునీత్ రాజ్‌కుమార్ సంఘం జిల్లాధ్యక్షుడు సాదిక్ పేర్కొన్నారు. సోమవారం నగరంలోని నిరాశ్రిత కేంద్రంలో సినీనటుడు పునీత్ రాజ్‌కుమార్ జయంతి సందర్భంగా పునీత్ చిత్రపటానికి పూలమాల వేసి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం ప్రారంభించి మాట్లాడారు. ఆరోగ్య, వైద్య, అత్యవసర, అనాథ పిల్లలకు సేవలు ఇతరత్రాలను ఎవరికీ తెలియకుండా చేశారని గుర్తు చేశారు.
అందరి గుండెల్లో పునీత్‌కు సుస్థిర స్థానం