
తొట్లిలో కేదారేశ్వరవ్రతం ఆచరిస్తున్న మహిళలు
కోలారు: నగరంతో పాటు తాలూకా వ్యాప్తంగా దీపావళి పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పండుగ సందర్భంగా మహిళలు ఇళ్లలో లక్ష్మీదేవిని ప్రతిష్టించి పూజలు చేశారు. కజ్జికాయలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించారు. ఇంటి ముంగిట తోరణాలు కట్టి అలంకరించారు. పండుగ సందర్భంగా నగరంలోని పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు.
మాలూరు: పట్టణంతో పాటు తాలూకాలో దీపావళి సందర్భంగా మహిళలు ఇళ్లలో లక్ష్మీదేవిని ప్రతిష్టించి నోముదారాలు కట్టుకుని భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పట్టణంలోని రాజపురోహితుడు నాగరాజ్ స్వామి ఇంటి ఆవరణలో ప్రతిష్టించిన లక్ష్మీదేవిని మహిళలు పెద్ద సంఖ్యలో దర్శించుకుని పూజలు చేశారు. పట్టణంలోని మారికాంబ, ముత్యాలమ్మ, వీరాంజనేయస్వామి, లక్ష్మీ నరసింహస్వామి తదితర ఆలయాల్లో ప్రత్యేక పూజలను జరిపారు.

మాలూరులో లక్ష్మీపూజ నిర్వహిస్తున్న మహిళలు

కోలారులో కజ్జికాయలు పంచుకున్న గ్రామపెద్దలు