
శివాజీనగర: లోకసభ ఎన్నికలకు బీజేపీ, జేడీఎస్ కూటమి ఏర్పాటు గురించి చర్చలు ఆరంభంలో ఉన్నాయి, సీట్ల పంపకాలపై ఇంతవరకు చర్చలు కాలేదని జేడీఎస్ నేత హెచ్.డీ.కుమారస్వామి తెలిపారు. శనివారం నగరంలో పద్మనాభనగరలో ఉన్న తండ్రి దేవెగౌడ ఇంటికి కుమార వచ్చి రెండు గంటల పాటు చర్చలు జరిపారు. తరువాత మీడియాతో మాట్లాడిన ఆయన, నా ఆరోగ్యం గురించి మాట్లాడాను, మాజీ సీఎం యడియూరప్ప మా పార్టీ, దేవెగౌడ, నా గురించి మంచిగా మాట్లాడారు. పొత్తు బీజేపీకి, జేడీఎస్‌కు తప్పనిసరి కాదు, పరస్పరం విశ్వాసం, గౌరవం ముఖ్యం. కార్యకర్తల సమావేశం జరిపి వారి అభిప్రాయం తీసుకోవాలని దేవెగౌడ సూచించారని చెప్పారు.
నేడు పార్టీ సమావేశం
ఈ నేపథ్యంలో నగరంలో ప్యాలెస్ మైదానంలో ఆదివారం జేడీఎస్ సమావేశం జరగనుంది, లోక్‌సభ ఎన్నికల పొత్తు గురించి చర్చించే అవకాశముంది. దేవెగౌడ, కుమారస్వామి సహా ఎమ్మెల్యే, ఎంపీల వరకు అన్ని స్థాయిల నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు.