చలానా చిక్కులకు చెల్లుచీటీ | Sakshi
Sakshi News home page

చలానా చిక్కులకు చెల్లుచీటీ

Published Sun, Aug 27 2023 12:38 AM

- - Sakshi

బనశంకరి: మోటారు వాహన చట్టం నిబంధనలు ఉల్లంఘన కేసుల్లో పాత పద్ధతిలో జరిమానా విధిస్తున్న రవాణా శాఖ హైటెక్‌ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా చలానాలు జారీచేయనున్నారు. పర్సనల్‌ డిజిటల్‌ అసిస్టెంట్‌ (పీడీఏ) పరికరాల ద్వారా జరిమానా విధిస్తారు. ఎలక్ట్రానిక్‌ – చలాన్‌ వ్యవస్థతో నగదు రహిత లావాదేవీలు జరుగుతాయి. ప్రస్తుతం మోటారు వాహనాల ఇన్స్‌స్పెక్టర్లు వాహనాలను తనిఖీల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనదారులకు చెక్‌ రిపోర్టు రాసి కేసు నమోదు చేస్తారు. వాహనాల యజమానులు, లేదా డ్రైవర్లుకు జరిమానా రశీదును అందిస్తారు. నగదు ఉంటే వారు అక్కడికక్కడే జరిమానా చెల్లిస్తారు. నగదు లేని వారు ఆర్‌టీఓ కార్యాలయాలకు వెళ్లి చెల్లించడం సాధారణం.

పలు రాష్ట్రాల్లో ఈ – చలాన్‌
ఈ–చలాన్‌ వ్యవస్థ జారీకాబడితే మాన్యువల్‌ వ్యవస్థ ఉండదు. జరిమానా చెల్లింపులకు పెద్దగా శ్రమ ఉండదు. ట్రాఫిక్‌ పోలీసులు, ఎంవీఐల వద్ద ఉండే పీడీఏ పరికరాల్లో క్రెడిట్‌ లేదా డెబిట్‌ కార్డు స్కైప్‌ చేసి యూపీఐ ద్వారా జరిమానా కట్టేయవచ్చు. ఆ వెంటనే ఎస్‌ఎంఎస్‌ చెల్లింపుదారుకు వస్తుంది. ఇలా నగదు చెల్లింపుల్లో జరిగే అవినీతికి కొంచైమెనా అడ్డుకట్ట పడుతుంది. ఢిల్లీ, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లో ఇప్పటికే ఇ–చలాన్‌ వ్యవస్థ అమల్లో ఉంది. రాష్ట్రంలో 67 ఆర్‌టీఓ కార్యాలయాల పరిదిలో సుమారు 200 మంది మోటారువాహనాల ఇన్స్‌స్పెక్టర్లు పనిచేస్తున్నారు. ఇ–చలాన్‌ వసూలుకు బ్యాంకులతో ఒప్పందాలు చేసుకున్నారు.

క్షణాల్లో వాహన సమాచారం
పీడీఏ పరికరాలను వాహన సమాచారం ఉండే సారథి–4 వాహన్‌–4 సర్వర్లతో అనుసంధానిస్తారు. అధికారులు పీడీఏ పరికరాల్లో వాహనాల నంబరు నమోదు చేయగానే ఆ వాహన యజమాని, లైసెన్స్‌, ఆర్‌సీ సమాచారం, గతంలో పెండింగ్‌ జరిమానాలు ఉంటే ఆ వివరాలు ప్రత్యక్షమవుతాయి. ట్యాక్స్‌ పెండింగ్‌ కూడా తెలుపుతుంది. బెంగళూరులోని రాజాజీనగర ఆర్‌టీఓ పరిధిలో ప్రయోగాత్మకంగా ఇ–చలాన్‌ వ్యవస్థ అమల్లో ఉండగా ఉత్తమ స్పందన లభించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఇ–చలాన్‌ వ్యవస్ద అమలుచేయాలని తీర్మానించామని రవాణాశాఖ కమిషనర్‌ ఏఎం.యోగేశ్‌ తెలిపారు.

1/1

Advertisement

తప్పక చదవండి

Advertisement