నకిలీ హిజ్రా హల్‌చల్‌ | - | Sakshi
Sakshi News home page

నకిలీ హిజ్రా హల్‌చల్‌

Jul 16 2023 12:12 AM | Updated on Jul 16 2023 8:18 AM

మారువేషంలో చేతన్‌  - Sakshi

మారువేషంలో చేతన్‌

పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్‌ డబ్బుల కోసం మహిళ వేషం

యశవంతపుర: విలావంతమైన జీవనం కోసం మారువేషం వేసి వీధుల్లో భిక్షం అడుగుతున్న వ్యక్తిని బాగలగుంట పోలీసులు అరెస్ట్‌ చేశారు. బాగలగుంటకు చెందిన చేతన్‌ హిజ్రా వేషంలో భిక్షాటన చేయటం ప్రారంభించాడు. పెళ్లి చేసుకున్న చేతన్‌కు పిల్లలున్నారు. విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన చేతన్‌ డబ్బుల కోసం మహిళ వేషం వేసి హిజ్రాలతో కలిసి నాగసంద్ర మెట్రోస్టేషన్‌ వద్ద భిక్షాటన చేస్తున్నారు.

డబ్బులివ్వని వారిపై దౌర్జన్యం చేసేవాడు. నాగసంద్ర మెట్రోస్టేషన్‌ వద్ద ఆక్రమంగా షెడ్‌ వేసుకున్నాడు. ఈనెల 13న బీఎంఆర్‌సీఎల్‌ అధికారులు షెడ్‌ను తొలగించే విషయంపై పరిశీలన చేయగా అధికారులపై కూడా దౌర్జన్యం చేశాడు. స్థానికులు పట్టుకొని చేతన్‌ను చితకబాది అసలు విషయాన్ని బహిరంగం చేశారు. అనంతరం బాగలగుంట పోలీసులు చేతన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement