ఉచిత ప్రయాణం.. టికెట్‌ తీసుకోనని మొండికేసిన వృద్ధుడు | - | Sakshi
Sakshi News home page

ఉచిత ప్రయాణం.. టికెట్‌ తీసుకోనని మొండికేసిన వృద్ధుడు

Jun 23 2023 7:44 AM | Updated on Jun 24 2023 7:48 AM

- - Sakshi

కర్ణాటక: రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం తెస్తున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఈ పథకంతో బస్సుల్లో కండక్టర్లు, డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి దొడ్డ తాలూకాలో చోటుచేసుకుంది. దొడ్డ తాలూకా కొట్టిగేమాచేనహళ్లి గ్రామం నుండి దొడ్డబళ్లాపురంకు వస్తున్న బస్సులో ఎక్కిన వృద్ధుడు నానా హంగామా చేసాడు.

వృద్ధులకు కూడా ఉచితం ప్రకటించిందని తాను టికెట్‌ తీసుకోనని మొండికేసాడు. కండక్టర్‌, తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా మాట వినలేదు. ఎట్టకేలకు వృద్ధుడు టికెట్‌ తీసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన ప్రయాణికులు సోషల్‌ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement