రాయచూరు రూరల్: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కరువు సాయం పంపిణీలో తారతమ్యం చూపించిందని పేర్కొంటూ తిరిగి రాష్ట్ర సర్కార్‌కు పరిహార నిధిని చెక్ రూపంలో చెల్లించిన ఘటన యాదగిరి జిల్లాలో చోటు చేసుకుంది. రాష్ట్ర సర్కార్ కరువు సహాయం కింద రైతుల ఖాతాలోకి రూ.2500 వేయాల్సి ఉంది. హొనగెరలో రైతులకు మొదటి విడతలో రూ.1000, రూ.1500, రూ.2000 చొప్పున జమ చేశారు. రైతులు సర్కార్ జమ చేసిన కరువు సహాయం కోసం రైతులు అదనంగా రూ.1000 జమ చేసి సర్కార్‌కు రూ.2500 చెక్‌ను పంపిణీ చేశారు. యాదగిరిలో రైతులు సర్కార్‌కు డబ్బులు వాపస్ చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయం తమకు వద్దంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు.


