ఆచారం ఘనం.. సంప్రదాయం వైభవం | - | Sakshi
Sakshi News home page

ఆచారం ఘనం.. సంప్రదాయం వైభవం

Nov 12 2026 1:19 AM | Updated on Nov 12 2026 1:19 AM

హొసపేటె: ఆధునికతకు ఏ మాత్రం తీసిపోసి ఆచార వ్యవహారాలు, తరతరాలుగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట.. ఆధునికత ఎంతగా పెరిగినా.. తమ పూర్వీకుల సంస్కృతి, సంప్రదాయాలను మాత్రం మరిచి పోలేదు. బంజారా సమాజ ప్రజలు తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలను నేటికీ కొనసాగిస్తూ దీపావళి పండుగను తమదైన ప్రత్యేక గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ఘనంగా జరుపుకుంటున్నారు. తాండాల్లో బంజారాల దీపావళి సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీపావళి వేడుకల్లో భాగంగా బంజారా యువతులు గుంపులుగా కొండ ప్రాంతాలకు వెళ్లి పూలను సేకరిస్తారు. అనంతరం లావణి జానపద గీతాలు ఆలపిస్తూ ఆనందోత్సాహాల మధ్య తిరిగి తాండాలకు చేరుకుంటారు. ఈ సందర్భంగా పెద్దవయస్సు మహిళలు, యువతులకు సంప్రదాయ అద్దాల కసూతి కళలు, జానపద గీతాలు, నృత్యాల విశిష్టతను వివరిస్తూ తమ సంస్కృతిని భావితరాలకు అందిస్తున్నారు.

రంగురంగుల వస్త్రధారణ.. అద్దాల కసూతి కళావైశిష్ట్యం..

బంజారాల దీపావళి వేడుకల్లో జానపద నృత్యాల సందడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement